ETV Bharat / entertainment

Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : బాక్సాఫీస్​ పోటీపై బాలయ్య అలా.. రవితేజ ఇలా.. కామెంట్స్​ వైరల్​ - భగవంత్ కేసరి వర్సెస్ టైగర్ నాగేశ్వరరావు

Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : భగవంత్ కేసరి - టైగర్ నాగేశ్వరరావు సినిమాలు పోటీపడటంపై బాలయ్య - రవితేజ మాట్లాడారు. తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్​ వైరల్​గా మారాయి.

Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : బాక్సాఫీస్​ పోటీపై బాలయ్య అలా.. రవితేజ ఇలా.. కామెంట్స్​ వైరల్​

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 12:41 PM IST

Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : మరో మూడు నాలుగు రోజుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు త్రిముఖ పోరు కనపడనుంది. బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, దళపతి విజయ్ లియో.. ఒక్క రోజులో రిలీజ్ కానున్నాయి. అయితే ఈ పోటీపై బాలయ్య - రవితేజ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి. డబ్బింగ్ సినిమా లియో గురించి కాస్త పక్కనపెడితే.. తెలుగు చిత్రసీమలో భగవంత్ కేసరి - టైగర్ నాగేశ్వరరావు మధ్య పోటీగానే అందరూ చూస్తున్నారు. రెండు మూవీటీమ్స్​ కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాయి. ఈవెంట్లు నిర్వహిస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నాయి.

తాజాగా టైగర్ నాగేశ్వరరావు మూవీటీమ్​.. ప్రీ రిలీజ్ ఈవెంట్​ను గ్రాండ్​గా నిర్వహించింది. ఈ సందర్భంగా దసరా పండక్కు బాక్సాఫీస్ వద్ద నెలకొన్న వార్​ గురించి రవితేజ మాట్లాడారు. తన పాన్ ఇండియా చిత్రంతో పాటు రిలీజ్ కానున్న ఇతర సినిమాలకు బెస్ట్ విషెస్​ తెలిపారు. "నా బ్రదర్ లాంటి డైరెక్టర్​ అనిల్ రావిపూడి సినిమా, మా బాలయ్య బాబు సినిమా భగవంత్ కేసరి కూడా విడుదల అవుతోంది. రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సమయంలో విజయ్ లియో కూడా మంచి సక్సెస్​ను అందుకోవాలని ఆశిస్తున్నాను." అని పేర్కొన్నారు.

అంతకుముందు పోటీ గురించి ప్రెస్​ మీట్​లో బాలయ్య కూడా మాట్లాడారు. "ఛాలెంజ్​.. పోటీ లేనిదే ఏ రంగంలోనూ ఫలితాలు ఆశాజనకంగా ఉండవు. అయినా మాకు మేమే పోటీ. నాకు ఎవరూ పోటీ లేరు. ఎవరినీ పట్టించుకోను. నా సినిమాలు నాకే పోటీ." అని అనడం కాస్త ఘాటుగా అనిపించిందని కొందరు అన్నారు. అయినా ఆయన సందర్భానికి తగ్గట్టుగానే పాజిటివ్​ వైబ్​లో మాట్లాడారు. తన సినిమా తనకే పోటీ అనే అన్నారు తప్ప... ఎవరినీ కించపరచలేదు అని మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతంలోనూ వీరిద్దరు అన్​స్టాపబుల్ షోలో కలిసి ఎంత సరదాగా మాట్లాడుకున్నారో తెలిసిందే.

  • #NandamuriBalakrishna : "మాకు మేమే పోటీ. నాకెవరూ పోటీ లేరు నేనేవ్వడని పట్టించుకోను"

    I compete only with myself! Don't care about others!! pic.twitter.com/nhWcq5qMts

    — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.