ETV Bharat / entertainment

బన్నీ 'శ్రీవల్లి' స్టెప్​ సీక్రెట్​ చెప్పిన అమితాబ్​.. ఏంటంటే? - అమితాబ్​ బచ్చన్​ చెప్పు స్టెప్పు

Amitab bachan Alluarjun slipper Step: 'పుష్ప'లోని అల్లుఅర్జున్​ శ్రీవల్లి చెప్పు స్టెప్పు గురించి బాలీవుడ్​ బిగ్​బి అమితాబ్ బచ్చన్​ ఓ సీక్రెట్​ చెప్పారు. అదేంటంటే..

Alluarjun Srivalli step
అల్లుఅర్జున్​ శ్రీవల్లి స్టెప్​
author img

By

Published : Aug 13, 2022, 8:59 AM IST

Amitab bachan Alluarjun slipper Step: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్యూటీఫుల్ భామ ర‌ష్మిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'పుష్ప‌'. ఈ చిత్రంలోని బన్నీ నటన, డైలాగ్స్​, సాంగ్స్​, సుకుమార్​ టేకింగ్..​ ఇలా ప్రతీది దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సాంగ్స్ విడుదలయ్యాక ఆ స్టెప్పులను సెలెబ్రిటీలు సైతం రీక్రియెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్​లు చేసి సందడి చేశారు. ఇక శ్రీవల్లి సాంగ్​లో అల్లు అర్జున్ చెప్పు స్టెప్పు తెగ అలరించింది. బన్నీ గాగుల్స్​ పెట్టుకుని చెప్పుల్ని ఈడ్చుతూ స్టెప్పు వేయడం, చెప్పు జారిపోతే దానిని సరి చేసుకోవడం అభిమానులను బాగా ఆకట్టుకుంది. సింపుల్​గా అనిపించే ఈ స్టెప్​కు సెలెబ్రిటీలు కూడా థ్రిల్ అయ్యారు. అయితే తాజాగా ఈ స్టెప్పుకు సంబంధించి ఓ సీక్రెట్​ చెప్పారు బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​. కొరియోగ్రఫీలో భాగంగా బన్నీ అలా డ్యాన్స్ చేయలేదని.. చెప్పు జారిపోవడం మిస్టేక్​గా జరిగిందని చెప్పారు.

ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 14 సీజన్ ప్రారంభమైంది. ఈ షోలో పుష్ప గురించి ఓ ప్రశ్న వచ్చినప్పుడు.. అమితాబ్ బచ్చన్.. చెప్పు స్టెప్పు గురించి అసలు మ్యాటర్ లీక్ చేశారు. "ఓ చిత్ర షూటింగ్​లో భాగంగా నేను హైదరాబాద్ వెళ్లాను. అప్పుడు అల్లు అర్జున్ స్టెప్ బాగా వైరల్ అవుతోంది. 'కొరియోగ్రఫీలో భాగంగా బన్నీ ఇలా డ్యాన్స్ చేశారా లేదా అనుకోకుండా వేసిందా' అని మా డైరెక్టర్​తో అడిగాను. మా దర్శకుడు వివరాలు తెలుసుకుని అసలు విషయం చెప్పాడు. అల్లు అర్జున్ చెప్పు జారిపోవడం పొరపాటుగా జరిగింది. అది కొరియోగ్రఫీ కాదు. కానీ సుకుమార్​కు అది నచ్చడంతో అలాగే ఉంచేశారట" అని బిగ్​బీ చెప్పుకొచ్చారు. అలా అల్లు అర్జున్ పొరపాటుగా చేసిన చెప్పు స్టెప్ వైరల్​గా మారింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, 'చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయనే.. ' అంటూ ఆకట్టుకున్న ఈ సాంగ్​లో పల్లెటూరి యువకుడిగా అల్లు అర్జున్‌.. పూర్తిగా ఒదిగిపోయి కనిపించారు. పల్లెటూరి యువతిగా రష్మిక లుక్స్‌ బాగా ఆకట్టుకోగా.. ఈ సాంగ్‌లో మరింత అమాయకంగా, అందంగా కనిపించి ఫ్యాన్స్​ను ఫిదా చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. రెండో భాగం త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుంది.

ఇదీ చూడండి: ఉత్కంఠగా 'కార్తికేయ 2'.. ఫ్యాన్స్​కు విజువల్​ ట్రీట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.