young boys attacked in Miyapur: హైదరాబాద్ మియాపూర్‌లో ఇద్దరు యువకులు కత్తులతో హల్‌చల్ చేశారు. ఓల్డ్ హఫీజ్‌పేట్ డీమార్ట్ వద్ద యువకులు.. కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఘర్షణలో ఇద్దరికి గాయాలై.. అక్కడే కుప్పకూలరు. స్థానికులు ఒక్కరిని ఆటోలో.. మరొకరిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గొడవకు గల కారణాల కోసం ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు యువకులు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఇద్దరు యువకుల వివరాలు సేకరిస్తున్నారు.
ఇవీ చదవండి: