Two Childrens Injured in Helium Balloon Explosion: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో హీలియం బెలూన్ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరినీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఆగిరిపల్లికి చెందిన షేక్ అలియా అనే మహిళ.. స్థానికంగా ఉన్న ఓ బ్యాంకుకు వెళ్ళింది. తన వెంట కుమార్తెతో పాటు మరో బాలికను కూడా తీసుకెళ్లింది. అలియా బ్యాంకులో పనిచేసుకుంటున్న సమయంలో చిన్నారులిద్దరూ బ్యాంకు మేడపైకి వెళ్లారు. అదే సమయంలో ఓ పార్టీకి చెందిన భారీ హీలియం బెలూన్ పేలింది. ఈ పేలుడు దాటికి చిన్నారులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
ఇవీ చదవండి:
- కలెక్టర్లూ ప్రెస్మీట్లు పెట్టండి.. గట్టిగా తిట్టండి..!: సీఎం జగన్
- కేసీఆర్ కథ, స్కీన్ప్లేతో 'ఫైల్స్' సినిమా.. కానీ అట్టర్ ఫ్లాప్: కిషన్రెడ్డి