ETV Bharat / crime

రోకలి బండతో భర్తను కొట్టి చంపిన భార్య - nizamabad crime news

నిత్యం మద్యం తాగి.. వేధింపులకు గురిచేస్తున్న భర్తను.. భార్య రోకలి బండతో కొట్టి చంపింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా సారంగాపూర్‌లో చోటు చేసుకొంది.

రోకలి బండతో భర్తను కొట్టి చంపిన భార్య
రోకలి బండతో భర్తను కొట్టి చంపిన భార్య
author img

By

Published : Apr 2, 2021, 10:05 AM IST

మానసికంగా వేధిస్తూ వస్తున్న భర్తను భార్య రోకలి బండతో కొట్టి చంపిన ఘటన నిజామాబాద్ జిల్లా పదమూడో డివిజన్‌ పరిధిలోని సారంగాపూర్‌లో చోటు చేసుకొంది. ఆలకుంట ఎల్లయ్య(54), నర్సమ్మ దంపతులు కోటగల్లీలో మహిళను చంపిన హత్య కేసులో జైలుకు వెళ్లి గత నెల 22న బెయిల్‌పై విడుదలైవచ్చారు. ఎల్లయ్య.. నిత్యం మద్యం తాగి రావడమే కాకుండా, భార్యను వివాహేతర సంబంధం పెట్టుకొంటున్నావని తరచూ అనడంతో మానసికంగా విసిగిపోయి బుధవారం రాత్రి తిరగబడింది.

ఆవేశంతో ఉన్న ఆమె గొడవ సద్దుమణిగాక.. నిద్రిస్తున్న ఎల్లయ్యను రోకలి బండతో ముఖంపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్తె రేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నర్సమ్మను అదుపులోకి తీసుకొన్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.