ఆలయాల్లో దొంగతనాలు గురించి అప్పుడప్పుడు వార్తల్లో చూస్తాం. అసలు వాళ్లకి దేవుడంటే భయం ఉండదు అందుకే ఇలా చేస్తారు అనుకుంటాం. కానీ ఈ దొంగకి మాత్రం అమ్మవారు అంటే చాలా భయం. అయినా సరే ఆలయంలో దొంగతనం చేయాలనుకున్నాడు. ఇంతకీ అతను హుండీని ఎలా దోచుకున్నాడంటే...
ఖమ్మం జిల్లాలోని కొండయ్యగూడెంలోని అంకమ్మ ఆలయంలో అక్టోబర్ 29వ రాత్రి దొంగతనం జరిగింది. ఉదయం ఆలయం తెరిచేందుకు వచ్చిన పూజ లోనికి వెళ్లి చూడగ దొంగతనం జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం చేసిన దృశ్యాలు నమోదయ్యాయి. ''అమ్మా క్షమించు అమ్మా అంటూ దొంగ.. అమ్మవారి కాళ్లు మొక్కి దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగలకు కూడా దైవభక్తి ఉందని ఈ ఘటన రుజువు చేసింది.'' ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ చూడండి: ROBBERY: గుడిలో చోరీ... 48 గంటల్లో ఛేదించిన పోలీసులు
ఆలయంలో హుండీలనే ఎత్తుకెళ్లారు..!
లైవ్ వీడియో: చాముండేశ్వరీ ఆలయంలో చోరీ.. సీసీటీవీలో నిక్షిప్తం