ETV Bharat / crime

అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ

హైదరాబాద్ సంతోష్‌నగర్‌ ప్రధాన రహదారిపై కనీస భద్రతా చర్యలు చేపట్టకుండా సాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సంతోష్ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట వైపు వెళ్లే రహదారిపై లారీ అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అదే సమయంలో నిర్మాణ పనులు జరుగుతుండగా ఫ్లైఓవర్‌ నుంచి పెద్ద ఇనుప కడ్డీ కిందపడింది.

lorry
lorry
author img

By

Published : Mar 11, 2021, 4:49 PM IST

హైదరాబాద్ సంతోష్‌నగర్‌ ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. సంతోష్ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట వైపు వెళ్లే రహదారిపై లారీ అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

అదే సమయంలో ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు జరుగుతుండగా... పైనుంచి పెద్ద ఇనుప కడ్డీ కిందపడడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. ఇనుపకడ్డీ పడిన సమయంలో ఎవరూలేకపోవడంతో ప్రమాదం తప్పింది.

కనీస భద్రతా చర్యలు చేపట్టకుండా సాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. ఫ్లైఓవర్ పనులు భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి : రుణ యాప్‌ల కేసులో మరొకరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.