ETV Bharat / crime

Revenge: తాను వివాహమాడాల్సిన యువతిని పెళ్లి చేసుకున్నాడని..

author img

By

Published : May 28, 2021, 12:45 PM IST

మల్కాజిగిరి పీవీఎన్‌ కాలనీకి చెందిన రైల్వే ఉద్యోగి మద్ది విజయ్‌కుమార్‌ హత్య కేసులో గురువారం నిందితుణ్ని అరెస్టు చేశారు. తను పెళ్లి చేసుకోవాల్సిన యువతిని.. వివాహం చేసుకున్నాడన్న పగతో ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

police-chases-malkajgiri-murder-case-and-they-declared-its-revenge-based-murder
Revenge: తాను వివాహమాడాల్సిన యువతిని పెళ్లి చేసుకున్నాడని..

మల్కాజిగిరికి చెందిన మద్ది విజయ్‌కుమార్‌(30) రైల్వే వర్కుషాపు ఉద్యోగి. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన భవ్యతో 2013లో వివాహమైంది. మే నెలలో విజయ్‌కుమార్‌ తల్లికి కరోనా సోకడంతో.. ముందు జాగ్రత్తగా భార్యను పుట్టింటికి పంపాడు. ఈనెల 8వ తేదీన ఉదయం విజయ్‌కుమార్‌.. తన సోదరితో వీడియోకాల్‌ మాట్లాడుతున్నాడు. గుర్తుతెలియని వ్యక్తి తలుపు నెట్టుకొని లోపలికి వచ్చి వేట కొడవలితో దాడి చేయడంతో విజయ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని సోదరి వెంటనే స్థానికులకు ఫోన్లో విషయం చెప్పింది. వారు వచ్చి చూసేసరికే చనిపోయాడు.

మూడు రోజుల పాటు రెక్కీ..

సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫుటేజీలోని గుర్తుతెలియని వ్యక్తిని.. భవ్య బంధువు గుడ్డ శ్రీనివాస్‌రెడ్డి(30)గా గుర్తించారు. నిందితుడు డెహ్రాడూన్‌ ఆర్మీ రెజిమెంట్‌లో సిపాయిగా పని చేస్తున్నాడు. ఆమెను తొలుత అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని భావించినా, ఆ తర్వాత విజయ్‌కుమార్‌తో వివాహం చేశారు. అప్పటి నుంచి శ్రీనివాస్‌రెడ్డి విజయ్‌పై పగ పెంచుకున్నాడు. అతన్ని అంతమొదిస్తే భవ్య తిరిగి తన వద్దకే వస్తుందని భావించాడు. ఆమె వైజాగ్‌ వచ్చిన విషయం తెలుసుకున్నాడు. మే 5వ తేదీన వైజాగ్‌ నుంచి నగరానికి వచ్చాడు. మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించాడు. సికింద్రాబాద్‌లో వేట కొడవలి కొన్నాడు. మే 8వ తేదీ హత్య చేశాడు. ఎవరి కంటపడకుండా విశాఖకు వెళ్లిపోయాడు. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చూడండి: మతం మార్చుకోలేదని మైనర్​పై అత్యాచారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.