Minor girl gang rape in Meerpet : మీర్‌పేటలో మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ - Hyderabad news
Minor girl gang rape in Meerpet: హైదరాబాద్‌లోని మీర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. జిరాక్సు కోసం బయటకు వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి, లైగింకదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Minor girl gang rape in Meerpet: హైదరాబాద్ మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మైనర్ బాలికను అపహరించి, ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నాడు. జిరాక్సు కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి, లైగింకదాడికి పాల్పడ్డారు.
ఈనెల 5న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక చెప్పిన వివరాల ప్రకారం ప్రశాంత్‌నగర్‌కు చెందిన రతన్, మరో బాలుడు అత్యాచారానికి పాల్పడ్డారని మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. పోక్సో, అపహరణ, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. జులాయిగా తిరిగే రతన్‌పై ఇప్పటికే 4చోరీ కేసులు ఉన్నట్లు వివరించారు.
"అత్యాచారం జరిగిన విషయాన్ని బాలిక భయంతో ఇంట్లో వాళ్ల దగ్గర దాచిపెట్టింది. తల్లి గట్టి ప్రశ్నించడంతో చెప్పింది. ద్విచక్రవాహనంపై బాలికను తీసుకెళ్లిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నాం" అని మీర్పేట్ పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: