In Hyderabad youths are intoxicated: హైదరాబాద్ ఆజంపురలో మద్యం మత్తులో కొంత మంది యువకులు వీరంగం సృష్టించారు. ఫూటుగా మందు తాగి ఓ దుకాణానికి వెళ్లారు. అక్కడ సరకులను చిందర వందరగా పడేసి హంగామా చేశారు. వారిని వారించేందుకు వెళ్లిన స్థానికులపై విచుకుపడ్డారు. మందు బాబుల ఆగడాలు రోజురోజుకు మీరిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. హోం మంత్రి మహమూద్ అలీ నివాస సమీపంలోని చమన్ ప్రాంతంలో విచ్చలవిడిగా సాగుతున్న వైట్నర్ మత్తు అమ్మకాలను పోలీసులు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: