ETV Bharat / crime

Accident: చిన్నారిని ఢీకొట్టాడు... డివైడర్​ను ఢీకొని దొరికిపోయాడు

author img

By

Published : Jun 22, 2021, 9:13 PM IST

మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ వ్యక్తి... బాలికను ఢీకొట్టాడు. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్లి డివైడర్​ను ఢీకొట్టి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్​ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Drunk and Drive accident
మద్యం మత్తులో డివైడర్​ను ఢీకొట్టిన

మద్యం మత్తులో అదుపుతప్పి కారుతో ఓ వ్యక్తి డివైడర్​ను ఢీకొట్టిన ఘటన... హైదరాబాద్​ కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. నోయిశ్​(24) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి కారులో కూకట్‌పల్లి వైపు బయలుదేరాడు. ఆ సమయంలో కైత్లాపూర్ రోడ్డులో ఓ బాలికను ఢీకొట్టాడు.

అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతివేగంగా కారు నడిపాడు. అదుపుతప్పి ఐడీఎల్ చెరువు రోడ్డు మలుపు వద్ద డివైడర్​ను ఢీకొట్టి దొరికిపోయాడు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువతులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 1,24,907 మందికి కరోనా పరీక్షలు.. 1,175 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.