కారు అదుపుతప్పి... డివైడర్ అవతల వైపున వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మెదక్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కారు టిప్పర్ కిందకు చొచ్చుకు పోవడంతో ముందు భాగం నుజ్జునుజ్జయింది.
పటాన్చెరు నుంచి సంగారెడ్డి వెళ్తుండగా అదుపుతప్పిన కారు డివైడర్ దాటి అవతలి వైపు టిప్పర్‌ను ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న శంకరయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ చాలావరకు నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో టిప్పర్ నుంచి కారును వేరు చేశారు. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.