New Year Wishes in Different Languages: కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇక జనవరి 1వ తేదీన ప్రతి ఒక్కరి నోట వినిపించే మాట.. "హ్యాపీ న్యూ ఇయర్". వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియా వేదిక ఏదైనా విషెస్ మోత మోగిపోతాయి. అయితే.. చాలా మంది తెలుగు, ఇంగ్లీష్, హిందీ.. భాషల్లోనే ఈ విషెస్ చెప్పుకుంటారు. మరీ ముఖ్యంగా ఇంగ్లీష్‌లో ఎక్కువ మంది చెప్పుకుంటారు. అలా కాకుండా న్యూ ఇయర్ విషెస్‌ను వివిధ భాషల్లో చెబితే వచ్చే కిక్కే వేరు. అందుకే.. మీ కోసం 15 భాషల్లో న్యూ ఇయర్ విషెస్‌ను పట్టుకొచ్చాం. మరి ఇంకెందుకు ఆలస్యం వీటిని మీ ఆత్మీయులకు పంపించి.. వారికి ఈ ఇయర్‌ను స్పెషల్‌గా గుర్తుండిపోయేలా విషెస్ చెప్పండి..
- New Year : లండన్‌లో నూతన సంవత్సరాన్ని అందరికీ తెలిసిన రీతిలో అంటే ఇంగ్లీష్‌లో "Happy New Year" అని చెబుతారు. ఆరోజు అక్కడి ప్రజలు బాణాసంచా కాల్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.
- नया साल मुबारक हो: ఉత్తర భారతదేశంలో "నయా సాల్ ముబారక్ హో(Naya Saal Mubarak Ho)! " అని ఒకరికొకరు శుభాకాంక్షలు చెబుతుంటారు.
- Bonne Année : పారిస్‌లో(ఫ్రెంచ్) నూతన సంవత్సర శుభాకాంక్షలను "బోన్ అనీ!" చెబుతారు. అక్కడి ప్రజలను న్యూ ఇయర్‌ను పబ్స్, రెస్టారెంట్లలో సెలబ్రేట్ చేసుకుంటారు.
- Frohes neues Jahr : జర్మనీలో న్యూ ఇయర్‌ను "ఫ్రోహెస్ న్యూస్ జహర్(Frohes neues Jahr)!"(జర్మన్) అని విషెస్ చెబుతారు. అక్కడ కూడా ప్రజలు బాణాసంచా కాల్చి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని విషెస్ తెలుపుకుంటారు.
- Felice anno nuovo or Buon anno : ఇటలీలో న్యూ ఇయర్‌ను "ఫెలిస్ అన్నో నువో(Felice anno nuovo)!" లేదా "బూన్ అన్నో(Buon anno)" అని శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
- Feliz Ano novo : పోర్చుగీస్‌లో ప్రజలు "ఫెలిజ్ అనో నోవో(Feliz Ano novo)!" అంటూ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
- Akemashite omedetou gozaimasu : జపనీస్ సంస్కృతిలో, నూతన సంవత్సరంలో ప్రజలు ఒకరికొకరు "అకేమాషైట్ ఒమెడెటౌ గోజైమాసు(Akemashite omedetou gozaimasu)!" అని విషెస్ చెబుతుంటారు.
- С Новым Годом! : సాధారణంగా రష్యన్ భాషలో న్యూ ఇయర్‌ను "С Новым Годом! అని ఒకరికొకరు తెలుపుకుంటారు.
- سنة جديدة سعيدة : అరేబియన్లో ప్రజలు సాధారణంగా ఒకరినొకరు "سنة جديدة سعيدة! (సనా జదీదా సయీదా!)" అని పలకరించుకుంటారు.
- saehae bok mani badeuseyo : కొరియన్ భాషలో పండుగ ప్రారంభానికి గుర్తుగా "새해 복 많이 받으세요! (saehae bok mani badeuseyo /సాహె బోక్ మణి బడేసేయో!)" అని విషెస్ చెప్పుకుంటారు.
- Gelukkig nieuwjaar : డచ్ భాషలో "గెలుక్కిగ్ న్యూజార్!" అని ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటారు.
- gott nytt år : స్వీడిష్ భాషలో ప్రజలు సాధారణంగా నూతన సంవత్సరాన్ని "Gott nytt år!" అని విషెస్ చెప్పుకుంటారు.
- Mutlu yıllar : టర్కిష్ భాషలో కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు Mutlu yıllar అని విషెస్ చెప్పుకుంటారు.
- Feliz Año Nuevo : స్పానిష్‌లో న్యూ ఇయర్ విషెస్‌ను "¡Feliz Año Nuevo!" అని చెబుతుంటారు. సాధారణంగా, ఈరోజున బార్సిలోనాలోని కుటుంబాలు.. వీధుల్లో డ్యాన్సులు చేసి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు.
- Xīnnián kuàilè! : చైనా రాజధాని బీజింగ్‌లో ప్రజలు సాధారణంగా కొత్త సంవత్సరాన్ని బాణసంచా కాల్చి జరుపుకుంటారు. శ్రేయోభిలాషులకు "Xīnnián kuàilè!" ద్వారా విషెస్ చెబుతారు.
న్యూ ఇయర్ రిజల్యూషన్స్ సక్సెస్ అవ్వాలంటే - ఇప్పటి నుంచే ఈ టిప్స్ పాటించాలట!