Jimmy Carter Funeral : అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలు జార్జియాలో జనవరి 4న ప్రారంభమై జనవరి 9తో ముగియనున్నాయి. ఆయన పార్థfవ దేహాన్ని జార్జియా, వాషింగ్టన్ డీసీ తదితర ప్రాంతాలకు ప్రజల సందర్శనార్థం తీసుకెళ్లనున్నారు.
జనవరి 4 (శనివారం)
జార్జియాలోని ఫోబ్ సమ్టర్ మెడికల్ సెంటర్‌కు శనివారం ఉదయం 10.15 గంటలకు కార్టర్ కుటుంబం రాకతో అంత్యక్రియ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుత, మాజీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కార్టర్ భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలోకి(మోటార్ కేడ్) తీసుకెళ్తారు. ఈ వాహనం కార్టర్ స్వస్థలమైన జార్జియాలోని ప్లెయిన్స్‌కు వెళ్తుంది. ఉదయం 10.50 గంటలకు కార్టర్ కుటుంబం తాలూక పొలం దగ్గర కాసేపు ఆగుతుంది. అప్పుడు నేషనల్ పార్క్ సర్వీస్ చారిత్రక ఫామ్ బెల్‌ను 39 సార్లు మోగిస్తుంది. ఆ తరువాత తిరిగి అట్లాంటాకు మోటర్ కేడ్ ఉదయం 10.55 గంటలకు బయలుదేరుతుంది. ఇది మధ్యాహ్నం 3 గంటలకు జార్జియా స్టేట్ క్యాపిటల్ వద్ద ఆగుతుంది. కార్టర్ ప్రెసిడెన్షియల్ సెంటర్ వద్ద కార్టర్ భౌతిక కాయానికి పలువురు సంతాపం తెలియజేస్తారు. జనవరి 5, 6వ తేదీన కార్టర్ భౌతికకాయం అక్కడే ఉంటుంది.
జనవరి 7
కార్టర్ ప్రెసిడెన్షియల్ సెంటర్ నుంచి మోటార్ కేడ్ ఆదివారం ఉదయం 9.30 గంటలకు బయలుదేరుతుంది. ఉదయం 10 గంటలకు జార్జియాలోని డాబిన్స్ ఎయిర్ రిజర్వ్ బేస్‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి వాషింగ్టన్కు వెళ్లడానికి స్పెషల్ ఎయిర్ మిషన్ 39లో ప్రయాణిస్తారు. స్పెషల్ ఎయిర్ మిషన్ 39 మధ్యాహ్నం 12.45 గంటలకు మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు చేరుకుంటుంది. రాత్రి 7 గంటలకు ప్రజల సందర్శనార్థం యూఎస్ క్యాపిటల్‌లో ఉంచుతారు. జనవరి 8న కూడా కార్టర్ భౌతిక కాయాన్ని అక్కడే ఉంచుతారు.
జనవరి 9
కార్టర్ యూఎస్ క్యాపిటల్ నుంచి మోటర్ కేడ్ ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది. 9.30 గంటలకు వాషింగ్టన్ నేషనల్ కేథడ్రల్‌కు చేరుకుంటుంది. స్పెషల్ ఎయిర్ మిషన్ 39లో మధ్యాహ్నం 2 గంటలకు జార్జియాలోని ఫోర్ట్ మూర్లోని లాసన్ ఆర్మీ ఎయిర్ ఫీల్డ్‌కు కార్టర్ కుటుంబ సభ్యులు చేరుకుంటారు. ఆ తర్వాత ప్లెయిన్స్‌లోని మరనాత బాప్టిస్ట్ చర్చికి మోటర్ కేడ్ వెళ్తుంది. ఆ తర్వాత మోటార్ కేడ్ కార్టర్ నివాసానికి చేరుకుంటుంది. అక్కడ అంత్యక్రియలు జరుగుతాయి.