Four Year Old Boy Murder In AP : నాలుగేళ్ల బాలుడిని గొడ్డలితో హతమార్చిన ఘటన ఏపీలోని సీతారామరాజు జిల్లా ఎడపాక మండలం లక్ష్మీపురం పంచాయతీ మద్దిమడుగు గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ముర్రం కోటేశ్వరరావు సోదరితో కలిసి నాలుగేళ్ల బాలుడితో మట్టిని తేవడానికి పొలం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కోటేశ్వరరావు బాలుడిపై గొడ్డలితో దాడి చేయగా తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
సోదరిపై కూడా కోటేశ్వరరావు దాడికి ప్రయత్నించగా ఆమె చాకచక్యంగా తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకునేలోగా నిందితుడు పారిపోయాడు. కోటేశ్వరావుకు మతిస్థిమితం సరిగా లేదన్నారు. భార్య కొంతకాలం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. ఎటపాక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.