మిస్టరీగా మారిన సింగరేణి కార్మికుడు సంజీవ్ అదృశ్యం - SINGARENI workers in search of employee sanjiv latest news
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని బొగ్గుగనిలో అదృశ్యమైన సింగరేణి కార్మికుని ఆచూకీ మిస్టరీగా మారింది. సింగరేణి అధికారులతో పాటు నాలుగు రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్జీ-1 ఏరియాలోని సింగరేణి గోదావరిఖని GDK-11 వ బొగ్గు గనిలో జనరల్ మజ్దూర్ కార్మికుడు కోడం సంజీవ్ అదృశ్యం మిస్టరీగా మారింది. మంగళవారం ఉదయం షిఫ్ట్ విధులకు హాజరైన సంజీవ్ సాయంత్రం నాలుగు గంటలకు పైకి చేరుకోవాల్సి ఉండగా.. ఇప్పటికే ఆయన ఆచూకీ దొరకలేదు.
రెస్క్యూ బృందాలతో అన్వేషణ..
సింగరేణి రెస్క్యూ బృందాలతో పాటు అధికారులు వేర్వేరుగా గనిలో అన్వేషించారు. సంజీవ్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఓవర్‌మెన్‌తో మాట్లాడారు. మరో రెండు గంటలు అదనపు పని చేయాలనే సూచనతో అక్కడ విధులు నిర్వహించారు. ఆ తర్వాత రెండో షిఫ్టుకు హాజరైన కార్మికులు సంజీవ్ అదృశ్యమైనట్లు గుర్తించారు. అతడికి సంబంధించిన క్యాప్ ల్యాంపు రక్షణ దీపం ఎక్కడా కనిపించలేదు.
వివిధ కోణాల్లో వెతుకులాట..
కార్మికుడు గని లోపలే ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? గ్యాలరీలో తప్పిపోయాడా? అనే కోణంలో అన్వేషిస్తున్నారు. సంజీవ్ కుటుంబ సభ్యులు గని వద్దకు చేరుకొని ఆచూకీ కోసం వేడుకుంటున్నారు. స్వయంగా సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో షిఫ్ట్‌కు 8 బృందాల చొప్పున కార్మికుడి ఆచూకీ కోసం అన్వేషిస్తున్నాయి.
ఇదీ చదవండి: కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక