ETV Bharat / city

పీఠానికి భూమి కేటాయింపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్​ కోకాపేటలో అత్యంత ఖరీదైన భూమిని విశాఖ శారద పీఠానికి కేటాయించడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది.

author img

By

Published : Sep 30, 2019, 4:51 PM IST

highcourt
విశాఖ శారద పీఠానికి భూమి కేటాయించడంపై హైకోర్టు నోటీసులు

విశాఖ శారద పీఠానికి హైదరాబాద్​లో అత్యంత చౌక ధరకు భూమి కేటాయించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోట్ల విలువైన భూమిని కేవలం రూపాయికి ఎకరం చొప్పున కేటాయించడంపై ప్రభుత్వం వైఖరి తెలపాలని సర్కారుకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్​లోని కోకాపేటలో విశాఖ శారదపీఠానికి రూపాయికి ఎకరం చొప్పున.. రెండు ఎకరాలను కేటాయిస్తూ జూన్ 22న ప్రభుత్వం జీవో 71 జారీ చేసింది. జీవోను సవాల్ చేస్తూ సికింద్రాబాద్ లాలాపేట్​కు చెందిన సీహెచ్ వీరాచారి అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

కోకాపేటలో భూముల మార్కెట్ విలువ కోట్ల రూపాయలు ఉన్నదని... అయితే చట్టవిరుద్ధంగా కేవలం ఒక్క రూపాయికే ఎకరం కేటాయించారని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసి.. భూ కేటాయింపులు రద్దు చేయాలని కోరారు. స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని.. ప్రభుత్వ వైఖరి తెలపాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ ఎండీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్​తో పాటు.. శారదపీఠం ధర్మాధికారికి నోటీసులు జారీ చేసింది.

ఇదీ చూడండి: రేపు మంత్రివర్గ సమావేశం... కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.