సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణకు ఏపీలో కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్రి లేఖ రాశారు. తన కుమారుడు శ్రీనివాస్‌ను తక్షణం విడుదల చేయాలని ఆమె లేఖలో విజ్ఞప్తి చేశారు.
‘‘సుమారు నాలుగేళ్లుగా శ్రీనివాస్‌ను రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారు. న్యాయస్థానం, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణ జరపడం లేదు’’ అని సీజేఐకు రాసిన లేఖలో సావిత్రి పేర్కొన్నారు. జగన్‌మోహన్ రెడ్డిపై జరిపిన కోడికత్తి దాడి కేసులో శ్రీనివాస్ నిందితుడిగా ఉన్నారు.
- ఇదీ చదవండి : అయిదు రోజులకో ఆయుధం స్వాధీనం
- కోడి కత్తి కేసు: హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు శ్రీనివాసరావు