ETV Bharat / city

ఆటలు నేర్పాల్సిన గురువు ఆలస్యం పేరుతో శిక్షిస్తున్నాడు.! - gudivada latest news

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు వారిని క్రమశిక్షణ పేరుతో వేధిస్తున్నాడు. విద్యార్థులు చేసే తప్పులను క్షమించాల్సిన ఆ గురువు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారన్న కారణంతో వారిని మోకాళ్లపై నడిపించాడు ఓ టీచర్. ఈ సంఘటన ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది.

teacher discipline in ap
ఆటలు నేర్పాల్సిన గురువు ఆలస్యం పేరుతో శిక్షిస్తున్నాడు.!
author img

By

Published : Mar 1, 2021, 10:55 PM IST

పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులను మోకాళ్లపై నడిపించిన సంఘటన ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. పట్టణంలోని నెహ్రూచౌక్ సెంటర్​లో ఉన్న ఎస్​పీఎస్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు విధిస్తున్న శిక్షలపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారన్న కారణంతో వ్యాయామ ఉపాధ్యాయుడు మోకాళ్లపై నడిపించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత ఉపాధ్యాయుడిని సంప్రదించగా.. విద్యార్థులకు ఎటువంటి శిక్షలు విధించలేదని, వ్యాయామం చేయిస్తున్నామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

ఇదీచదవండి: సూర్యాపేట వద్ద హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.