TDP leaders fires on YSRCP: నాటుసారా మరణాల పై నుంచి దృష్టి మళ్లించేందుకే.. ఏపీ అసెంబ్లీలో పెగాసెస్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారని తెదేపా ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. వరుసగా అయిదో రోజూ.. అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. పార్లమెంటులో పెగాసస్‌పై చర్చ వద్దన్న వైకాపా.. అసెంబ్లీలో మాత్రం చర్చకు పట్టుపడుతోందని ఎద్దేవా చేశారు.
అధికారం ఉంది కనుక..పెగాసస్‌పై దర్యాపు చేసి నిజానిజాలు తేల్చి ప్రజల ముందుంచాలని సవాల్ చేశారు. చంద్రబాబు మీద బురద జల్లడానికే.. మమత బెనర్జీతో ఫేక్ మాటలు చెప్పించారని ఆరోపించారు. మద్యం, సారా కారణంగా రాష్ట్రంలో వెయ్యిమందికి పైగా చనిపోయారని నేతలు ఆరోపించారు. తాడేపల్లికి వచ్చే మద్యం ఆదాయం తగ్గుతుందనే.. పెగాసెస్ పై అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.
మందు కాదది విషం..
దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేనటువంటి బ్రాండ్స్ ఏపీలో ఉన్నాయి. మందు కాదు అది విషం. అది తాగిన వారి ఆరోగ్యాలు రోజురోజుకు చెడిపోతున్న సందర్భంలో ఒక కొత్త నాటకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో తీసుకొచ్చింది. అదేంటంటే పెగాసస్. రాష్టంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ పెగాసస్ అంశాన్ని శాసనసభలోకి తీసుకురావడం అత్యంత హేయమైన చర్య. దీనిని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించాలని చూసినా.. తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున నిలబడుతుంది. ఈ సమస్యపై పోరాటం చేస్తాం. -అచ్చెన్నాయుడు, ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు
ఇదీ చదవండి: