ETV Bharat / city

ఆ 5 మార్గాల్లో విద్యుదీకరణ పూర్తి: ద.మ రైల్వే

దక్షిణ మధ్య రైల్వే.. 2020-21 సంవత్సరంలో మొత్తం 750 కిలోమీటర్ల ట్రాక్‌లకు విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర కలిపి మొత్తం 182 కిలోమీటర్ల మేర రైలు మార్గాల్ని విద్యుదీకరించినట్లు తెలిపింది. రాష్ట్రం నుంచి.. ఏపీ, మహారాష్ట్రకు సంబంధించిన 5 రైలు మార్గాల్లో కలిపి దాదాపు 163 కిలోమీటర్ల మేరకు విద్యుదీకరణ పనులను పూర్తయినట్లు వివరించింది.

south central railway zone
దక్షిణ మధ్య రైల్వే
author img

By

Published : Apr 2, 2021, 1:28 PM IST

Updated : Apr 2, 2021, 1:41 PM IST

దక్షిణ మధ్య రైల్వే.. తన పరిధిలో 750 కి.మీ మేర రైలు మార్గాల్ని విద్యుదీకరించింది. ఇందులో 612 ట్రాక్‌ కి.మీ. నూతన సెక్షన్లు కాగా.. డబుల్‌ లైన్లలో 64 కి.మీ, మూడో లైన్‌ మార్గాల్లో 69 కి.మీ ట్రాక్‌ విద్యుదీకరణ పనులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో పూర్తయినట్లు వెల్లడించింది.

రాష్ట్రంలోని లింగంపేట-జగిత్యాల-మోర్తాడ్ మధ్య 50.50కి.మీలు, వికారాబాద్-కోహిర్ మధ్య 44.82కి.మీలు, మేడ్చల్-మనోహారాబాద్ మధ్య 13.08 కి.మీలు, ఫలక్ నుమా-ఉందానగర్ మధ్య 13.69కి.మీలు, రాఘవాపురం-కొలనూర్ మధ్య 30కి.మీలు, కొలనూర్-పొతకపల్లి మధ్య 12కి.మీలు విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్లు.. సౌత్​ సెంట్రల్​ రైల్వే తెలిపింది. ఏపీలో.. తెనాలి-రేపల్లె, కావలి-ఉల్వపాడు (మూడోలైను), మహారాష్ట్రలోని అకోలా-లోహన్‌ సెక్షన్‌లలో పనులు జరిగినట్లు.. ప్రకటించింది. కొవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో.. ప్రయాణికుల రైళ్లు తక్కువగా తిరుగుతున్నందున, ట్రాక్‌పై ఖాళీ సమయాన్ని వినియోగించుకున్నట్లు వివరించింది.

ఇదీ చదవండి: పుల్వామాలో ఎన్​కౌంటర్​- ముష్కరుడు హతం

Last Updated : Apr 2, 2021, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.