Maxwell Sehwag Fight : టీమ్ఇండియా దిగ్గజ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్- ఆసీస్ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇద్దరి మధ్య గతంలో జరిగిన ఓ వివాదం తాజాగా తెరపైకి వచ్చింది. 2017 ఐపీఎల్ సందర్భంగా వాళ్లిద్దరి మధ్య జరిగిన ఓ సంఘటన గురించి మ్యాక్స్‌వెల్ తాజాగా రిలీజ్ చేసిన 'ది షో మ్యాన్' పుస్తకంలో ప్రస్తావించాడు. ఆ సీజన్లో మ్యాక్స్‌వెల్ పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ కాగా, సెహ్వాగ్ ఫ్రాంచైజీ డైరెక్టర్‌గా వ్యవహరించాడు.
అయితే సెహ్వాగ్ ఎక్కువగా కెప్టెన్ నిర్ణయాలను ప్రభావితం చేసేవాడని, తుది జట్టుని తనే ఎంపిక చేసేవాడని మాక్స్‌వెల్ ఆరోపించాడు. ఆ సీజన్లో జట్టు వ్యవహారాల్లో సెహ్వాగ్ జోక్యం చేసుకున్నారని మాక్స్‌వెల్ పుస్తకంలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైలర్‌గా మారాయి.
అసలేం జరిగిందంటే?
'ఓ టెస్టు సిరీస్‌లో కలుసుకున్నప్పుడు నేను పంజాబ్‌కి కెప్టెన్‌గా ఉండబోతున్నట్లు సెహ్వాగ్ చెప్పాడు. అదే సమయంలో అతడు 'మెంటార్'గా ఉన్నాడు. దీంతో జట్టు ఎలా ఉందనే అంశంపై చర్చించాం. అప్పుడు అందరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయని అనుకున్నాను. కానీ, అదే నేను చేసిన తప్పు. మా కోచ్ అరుణ్ కుమార్‌కి అదే తొలి సీజన్. అయితే అతడు పేరుకు మాత్రమే కోచ్. తెరవెనుక అన్ని నిర్ణయాలు సెహ్వాగే తీసుకునేవాడు. ఇతర కోచ్‌లు, ఆటగాళ్లు నా దగ్గరకు వచ్చి 'అసలు ఏం జరుగుతుంది?' అని నన్ను పలుమార్లు అడిగే వారు. వాళ్లకు సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బంది పడేవాడిని'
'లీగ్‌లో చివరి మ్యాచ్‌లో మేం 73 పరుగులకు ఆలౌట్ అయ్యాం. ఆ మ్యాచ్ అనంతరం ప్రెస్‌మీట్‌కు నేను వెళ్లాల్సి ఉంది. కానీ, ఆ ప్రెస్‌మీట్‌కు సెహ్వాగ్ హాజరై, నన్ను బాధ్యత లేని కెప్టెన్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. ఇక నేను టీమ్ బస్‌లోకి వెళ్లేసరికి, వాట్సాప్ గ్రూప్ నుంచి నన్ను తీసేశారు. నాకేం అర్థం కాలేదు. హోటల్‌కి చేరుకునే సమయానికి సెహ్వాగ్ నుంచి వరుసగా మెసేజ్‌లు వస్తున్నాయి. కెప్టెన్‌గా సరైన బాధ్యతలు తీసుకోవడం లేదని సెహ్వాగ్ నన్ను నిందించాడు'
'ఆ మెసేజ్‌లు చదివి ఎంత బాధపడ్డా. అది చెప్పడానికి అతడికి మెసేజ్ చేశాను. ఆ ప్రవర్తనతో నాలో ఉన్న అభిమానిని కోల్పోయారని చెప్పాను. దానికి ఆయన 'మీలాంటి అభిమాని అవసరం లేదు' అని రిప్లై ఇచ్చాడు. అంతే ఆ తర్వాత మేం మళ్లీ మాట్లాడుకోలేదు. ఫ్రాంచైజీ యజమానులకు చాలా చెప్పాను. సెహ్వాగ్ జట్టుతోనే ఉంటే తప్పు చేసిన వారవుతారని, నన్ను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశాను' అని వివరించాడు.
Maxwell said 🗣️:- I texted him to say how much it hurt to read those comments and added that he had lost a fan in me for the way he had conducted himself.
— Harsh shekhawat (@wordofshekhawat) October 25, 2024
Sehwag's response was simple: " don't need fan like you." we never spoke again.
- we want both side of story before judging… pic.twitter.com/MEirD4W67j
కాగా, 2017 ఐపీఎల్‌లో మాక్స్‌వెల్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్‌ల్లో 310 పరుగులు చేశాడు. ఇక పంజాబ్ ఆ సీజన్లో 14 మ్యాచుల్లో 7 ఓడిపోయింది. కాగా, చివరి మ్యాచ్‌లో పుణెతో తలపడ్డ పంజాబ్ ఘోర ఓటమిని మూటగట్టుకొని, ఐదో స్థానంలో నిలిచింది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
The contrasting experiences Maxwell has had with two Delhi boys(Sehwag & Kohli)…
— Abhishek AB (@ABsay_ek) October 25, 2024
How much respect he has for Virat 👌 pic.twitter.com/8r5R0ih1m1
మ్యాక్సీ 'ఓవర్రేటడ్' - మాజీ క్రికెటర్‌కు తప్పని ట్రోల్ సెగ - Glenn Maxwell RCB
క్రికెటర్ నుంచి బ్యాంకర్‌గా మారిన సెహ్వాగ్ టీమ్‌మేట్ ఎవరంటే? - Virender Sehwag Cricket Friend