ETV Bharat / entertainment

LCU సాలిడ్ అప్డేట్- ఇంట్రెస్టింగ్ పోస్టర్ షేర్ చేసిన లోకేశ్ - LOKESH CINEMATIC UNIVERSE

LCU సాలిడ్ అప్డేట్- ప్రీల్యూడ్ వీడియోతో క్లారిటీ ఇవ్వనున్న డైరెక్టర్

Lokesh kanagaraj
Lokesh kanagaraj (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2024, 7:44 PM IST

Lokesh Cinematic Universe : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ తన సినిమాటిక్‌ యూనివర్స్‌ (LCU)తో భారతీయ సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచారు. ఈ క్రమంలోనే 'లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌'లో భాగంగా వచ్చిన 'ఖైదీ', 'విక్రమ్‌', 'లియో' సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా 'కూలీ' సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా కూడా ఎల్​సీయూ లిస్ట్​లో చేరుతుందా? అని సనీవర్గాల్లో చర్చ మొదలైంది.

అయితే దానికిపై క్లారిటీ ఇవ్వకముందే దర్శకుడు లోకేశ్‌, ఎల్‌సీయూకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్​ ఇచ్చారు. సినిమాటిక్‌ యూనివర్స్‌ ఎలా? ఎక్కడ మొదలైంది? అనే విశేషాలతో కూడిన ఓ ప్రీల్యూడ్‌ వీడియోను తీసుకురానున్నట్టు తన అఫీషియల్ ట్విట్టర్​ ద్వారా ప్రకటించారు. 10 నిమిషాల నిడివితో ఆ వీడియో రానుంది. 'ఛాప్టర్‌ జీరో' హ్యాష్‌ట్యాగ్‌తో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. '1 షాట్ 2 కథలు 24 గంటలు' అని పోస్టర్​లో రాసి ఉంది. గన్స్​, బుల్లెట్స్​తో కనిపిస్తున్న ఈ పోస్టర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. 'లోకేశ్ నుంచి భారీ స్థాయిలో ఇంకేదో రాబోతోంది' అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.