ETV Bharat / offbeat

గుంటూరు స్పెషల్ 'నిమ్మకాయ కారం' - చిటికెలో చేసేయండిలా! - ఒక్కసారి తిన్నారంటే నా సామిరంగా అనాల్సిందే!

ఎప్పుడూ రొటిన్​గా కూరలు, పచ్చళ్లే కాదు - ఓసారి ఈ స్పెషల్ రెసిపీని ట్రై చేయండి!

Guntur Special Nimmakaya Karam
Nimmakaya Karam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 25, 2024, 12:19 PM IST

Guntur Special Nimmakaya Karam Recipe : కొన్నిసార్లు ఎన్ని కూరలున్నా, కారప్పొడులను చూస్తే ప్రాణం లేచివస్తుంది. నువ్వుల కారం, కరివేపాకు పొడి, పల్లీ పొడి, నల్ల కారం, పుట్నాల కారం, కొబ్బరి కారం, శొంఠికారం, మిరియాల కారం వీటిల్లో ఏదైనా సరే వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి దట్టించి తింటే ఎంత కమ్మగా ఉంటుందో కదా! అవే కాదండోయ్‌. మీరు టేస్ట్ చేయాల్సిన మరో సూపర్ రెసిపీ ఉంది. అదే గుంటూరు స్పెషల్ 'నిమ్మకాయ కారం'. దీన్ని వేడి వేడి అన్నంలోనే కాదు, గరం గరం పునుగులు, అట్లు, గారెలు, సమోసాలు ఇలా దేనిలోకి తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది. ఇంతకీ ఈ టేస్టీ కారం తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఆవాలు - 1 టేబుల్​ స్పూన్
  • మెంతులు - 1 టేబుల్ ​స్పూన్
  • నిమ్మకాయలు - 10 నుంచి 15 (చిన్న సైజ్​వి)
  • కారం - 100 గ్రాములు
  • పసుపు - అర టీ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పచ్చి మిర్చి - 4

టిఫెన్ సెంటర్​ స్టైల్ "ఇడ్లీ కారం పొడి" - ఇలా తయారు చేస్తే ఎంతో కమ్మగా ఉంటుంది!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొని ఆవాలు, మెంతులు వేసుకొని లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత వాటిని మిక్సీ జార్​లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం నిమ్మకాయలను కట్ చేసుకొని ఒక గిన్నెలో రసం పిండుకోవాలి. ఈ రసం కొలత ప్రకారం 125 ఎంఎల్ ఉండాలి. ఆపై ఆ రసాన్ని ఒక మిక్సింగ్​ బౌల్​లోకి గింజలు లేకుండా జాలి గంటె సహాయంతో వడకట్టుకోవాలి.
  • ఆ తర్వాత అందులో కారం, పసుపు, ఉప్పు, గ్రైండ్ చేసుకున్న మెంతులు, ఆవాల పొడి వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా గరిటెతో బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు పచ్చి మిర్చిని అంగుళం సైజ్​ ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలోకి చాకుతో చీల్చుకోవాలి. తర్వాత ఆ పచ్చిమిర్చి చీలికలను ముందుగా మీరు కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అయితే కొందరు ఈ స్టేజ్​లో కొద్దిగా (2 స్పూన్ల) బెల్లం యాడ్ చేసుకుంటారు. కానీ ఇది ఆప్షనల్ మాత్రమే. మీకూ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు.
  • ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ఈ రెసిపీలో మీరు తీసుకున్న నిమ్మరసాన్ని బట్టి కారం, ఉప్పును అడ్జస్ట్ చేసుకోవాలి.
  • ఆ విధంగా కారం మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని ఒక గాలిచొరబడని జార్​లో స్టోర్ చేసుకుంటే చాలు. ఎంతో రుచికరంగా ఉండే గుంటూరు స్పెషల్ "నిమ్మకాయ కారం" రెడీ అయినట్లే!
  • ఇక దీన్ని ఫ్రిజ్​లో పెట్టకుండా అలానే నార్మల్​గా స్టోర్ చేసుకున్నా కనీసం నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది! అదే ఒకవేళ రిఫ్రిజిరేటర్​లో ఉంచితే సుమారు 3 నుంచి 4 నెలల పాటు నిల్వ ఉంటుందట. ఆపై మీకు అవసరమైనప్పుడు కొద్దిగా తీసుకుని వాటర్ కలుపుకుని వాడుకుంటే సరిపోతుంది!

హోటల్ స్టైల్​ "కారం పొడులు" - కూరలు బోర్​ కొడితే ఇవి ట్రైచేయండి - నెయ్యితో కలిపి తింటే అమృతమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.