ETV Bharat / technology

కొంగొత్త ఫీచర్లతో కాన్వా డ్రీమ్​ ల్యాబ్- ఇకపై హై క్వాలిటీ ఇమేజెస్​తో పండగే..! - CANVA DREAM LAB AI IMAGE GENERATOR

డ్రీమ్​ ల్యాబ్ లాంచ్ చేసిన కాన్వా- ఇది ఎలా పనిచేస్తుందంటే?

Canva Dream Lab AI Image Generator
Canva Dream Lab AI Image Generator (Canva)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 25, 2024, 12:51 PM IST

Canva Dream Lab AI Image Generator: ప్రపంచంలోనే ఏకైక ఆల్​ ఇన్​ వన్ విజువల్ కమ్యూనికేషన్ ప్లాట్​ఫారమ్ కాన్వా కొత్త డ్రీమ్​ ల్యాబ్ ఏఐ ఇమేజ్ జనరేటర్ ఫీచర్​ తీసుకొచ్చింది. ఇది ఏఐ ద్వారా టెక్ట్స్​ను ఇమేజ్​ రూపంలో మార్చేందుకు ఉపయోగపడుతుంది. కాన్వా.. Leonardo.Aiని కొనుగోలు చేసిన మూడు నెలల తర్వాత ఈ ఈ డ్రీమ్​ ల్యాబ్ విజువల్ సూట్​ను తీసుకొచ్చింది. కంపెనీ ఈ సూట్​లో మ్యాజిక్ రైట్, Polls and Quizzes, ఇంటరాక్టివ్ చార్ట్స్, AI- పవర్డ్ వైట్‌బోర్డ్ వంటి కొత్త టూల్స్​ను జత చేసింది.

కాన్వా ఏఐ ఇమేజ్ జనరేటర్ డ్రీమ్ ల్యాబ్: కాన్వా.. మంగళవారం ఈ డ్రీమ్​ ల్యాబ్​ను ప్రారంభించింది. ఇది AI- పవర్డ్ టెక్స్ట్-టు-ఇమేజ్ జనరేటర్. ఇది టెక్ట్స్​కు అనుగుణంగా ఫొటోస్, గ్రాఫిక్స్​ను క్రియేట్ చేస్తుంది. దీన్ని Leonardo.AI ఫీనిక్స్ ఫౌండేషన్ మోడల్ ఆధారంగా క్రియేట్ చేశారు. కాన్వాలో ఇప్పటికే డిఫ్యూజన్ బేస్డ్ ఏఐ ఇమేజ్​ను జనరేట్ చేసే సదుపాయం ఉంది. అయితే తాజాగా తీసుకొచ్చిన ఈ డ్రీమ్​ ల్యాబ్​ వినియోగదారులకు హై-క్వాలిటీ ఇమేజెన్​ను రూపొందించేందుకు ఉపయోగపడుతుంది.

ఈ ఏఐ ఇమేజ్ జనరేటర్ డ్రీమ్ ల్యాబ్ టెక్ట్స్​ ఆధారంగా 15 డిఫరెంట్ స్టైల్​లో ఇమేజెస్​ను రూపొందిచగలదు. ఈ స్ట్రైల్స్​లో 3D రెండర్స్, ఇలస్ట్రేషన్స్​ కూడా ఉన్నాయి. కాంటెక్స్ట్-అవేర్ ఏఐ మోడల్ మల్టీ సబ్జెక్ట్ ఇమేజెస్​ను, అలాగే ఫొటోరియలిస్టిక్ పోర్ట్రెయిట్‌లను క్రియేట్ చేయగలదు.

కాన్వా విజువల్ సూట్​లో సరికొత్త ఫీచర్స్: కొంగొత్త టూల్స్​, ఫీచర్లతో కాన్వా ఈ డ్రీమ్​ ల్యాబ్​ను తీసుకొచ్చింది. ఇవి డాక్యుమెంట్స్, వీడియోస్, ప్రజెంటేషన్ కోసం కావాల్సిన ఫార్మాట్​లో కంటెంట్​ క్రియేట్ చేసేందుకు ఉపయోగపడతాయి. కంపెనీ ఇప్పటికే ఉన్న టూల్స్​ను అప్​గ్రేడ్ చేసి కమ్యూనిటీ నుంచి వచ్చిన రిక్వెస్ట్స్ ఆధారంగా ఈ కొత్త ఫీచర్లను జత చేసింది.

ఇందులోని ఏఐ- పవర్డ్ వైట్‌బోర్డ్.. టెక్ట్స్​ను షార్ట్, సమ్మరైజ్ చేయగలదు. ఇందులో ఇంటరాక్టివ్ రియాక్షన్​ Stickies కూడా ఉన్నాయి. వీడియోస్ కోసం కాన్వా కొత్త యానిమేషన్ ఎఫెక్ట్స్​, ఆటో జనరేటెడ్ క్యాప్షన్స్​ను తీసుకొచ్చింది. ఇందులో కస్టమ్ మోకప్స్​ అనే కొత్త టూల్ ఉంది. ఇది ఒకే క్లిక్​తో ఫొటోలను ఆన్​- బ్రాండ్ మోకప్ టేంప్లెట్​లుగా మార్చగలదు. 'Polls and Quizzes' అనే మరో కొత్త టూల్ కూడా డ్రీమ్ ల్యాబ్​లో ఉంది. యూజర్స్ ఎడిటర్​లోనే ఈ టూల్​తో డైరెక్ట్​గా Polls and Quizzes క్రియేట్ చేయొచ్చు.

దేశంలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్- భారీ పెట్టుబడులతో ఇన్నోవేషన్‌ సెంటర్‌ కూడా..

శాంసంగ్ ఫస్ట్ ట్రై-ఫోల్డ్ స్మార్ట్​ఫోన్- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.