ETV Bharat / city

comments on kerala cm: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. ఉద్యోగి సస్పెండ్ - కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​

comments on kerala cm: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. ఉద్యోగి సస్పెండ్

author img

By

Published : Feb 6, 2022, 2:18 PM IST

14:02 February 06

comments on kerala cm: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. ఉద్యోగి సస్పెండ్

comments on kerala cm: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​పై ఓ ఉద్యోగి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం కలకలం రేపింది. ఈ సంఘటనపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సీఎం కార్యాల‌యం.. ఆ ఉద్యోగిని సస్పెండ్ చేసింది.

వివరాల్లోకెళితే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవల దుబాయ్​లో ప‌ర్య‌టించారు. ఈ పర్యటనలో అక్కడి దుబాయ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఈ త‌రుణంలో కేరళలో పెట్టుబడులు పెట్టాల‌ని.. అక్కడి విదేశీ వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే యూఏఈ మంత్రులు, అధికారులతో కలిసి దిగిన ఫొటోను సీఎం తన ట్విట్టర్​ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోలో సీఎం విజయన్ నల్ల సూట్, ప్యాంటు ధరించి, చొక్కా టక్‌తో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు.

అయితే ఈ ఫొటోపై సచివాలయ ఉద్యోగుల సంఘం సభ్యుడు మణికుట్టన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం వేషధారణలో గూండాలాగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మణికుట్టన్ తన వాట్సాప్ గ్రూప్​ల్లోనూ షేర్ చేశాడు. ఈ విషయాన్ని కొందరు సచివాలయ అధికారులు సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లగా.. అతడిని విధుల నుంచి తప్పించారు. అయితే ఈ వివాదంలో అతనిపై కక్షకట్టిన అధికార పార్టీ అనుకూల ఉద్యోగులు ఈ దుశ్చ‌ర‌్యకు పాల్పడ్డారని కొందరు ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి: వరుణుడి బీభత్సానికి కేరళలో 42మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.