PV SINDHU: అప్పన్న ఆలయానికి సింధు.. బంగారు పతకం సాధిస్తానని ధీమా - శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత.. పీవీ సింధు.. ఏపీ విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. వచ్చే ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

pv sindhu at appanna temple in simhachalam
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. తన తండ్రితో కలిసి స్వామివారి సన్నిధికి వచ్చిన ఆమెను.. వచ్చే ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలంటూ వేద పండితులు ఆశీర్వదించారు. సింధుకు అధికారులు స్వాగతం పలికారు. పూజ అనంతరం ప్రసాదం అందజేశారు.
ఆలయ మర్యాదలతో సింధును సత్కరించారు. దేశానికి వరుసగా రెండు ఒలింపిక్స్ పతకాలను అందించిన తొలి ఇండియన్‌గా రికార్డు సృష్టించిన సింధు.. మూడోసారి కూడా మెడల్ సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. సింహాచలం క్షేత్ర మహత్యాన్ని, స్వామివారి వైభవాన్ని పీవీ సింధుకు అర్చకులు, అధికారులు వివరించారు.