ఈ నెల 7 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో నూతన రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. కొత్త చట్టం, భూపరిపాలనలో చట్టాల సరళీకరణ, ఏకీకరణ తక్షణ అవసరం. భూమి యజమానికి తెలియకుండా రికార్డులు తారుమారవుతున్న వేళ... భూమి హద్దులు స్పష్టంగా ఉండటం, ఓసారి ప్రభుత్వం నుంచి భూమి కాగితం వచ్చిందంటే అది అంతిమంగా ఉండాలంటున్న ప్రముఖ భూచట్టాల రూపకల్పన నిపుణులు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎం.సునీల్‌కుమార్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి.
'ఓసారి ప్రభుత్వం నుంచి వచ్చిన కాగితమే అంతిమం కావాలి'
రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భూమాఫియా, అవినీతి, అక్రమాలు అన్ని స్థాయిల్లో రాజ్యమేలుతున్న తరుణంలో రైతులు, భూయజమానుల ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికే ఈ చట్టం రూపకల్పనపై విస్తృత కసరత్తు సాగుతోంది. గత రెండేళ్లుగా కొత్త రెవెన్యూ చట్టం తెస్తామని సీఎం కేసీఆర్ చెబుతూ వస్తున్న నేపథ్యంలో రెవెన్యూ, పరిపాలన, సంస్కరణలు, చట్టాల్లో మార్పుల ఆవశ్యకతపై చర్చ కొనసాగుతోంది.