ETV Bharat / city

condolence To sirivennela: సిరివెన్నెల మరణం పట్ల ప్రముఖుల సంతాపం - kcr on sirivennela

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

sirivennela
sirivennela
author img

By

Published : Nov 30, 2021, 7:26 PM IST

Updated : Nov 30, 2021, 7:40 PM IST

ప్రముఖ సినీగేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల గవర్నర్​ తమిళిసై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్త తెలిసి చాలా బాధపడినట్లు తెలిపారు. ఆయన కుటుంబం, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • Saddened to know about demise of legendary Telugu lyricist Sirivennela Sitarama Sastry garu.
    Deep condolences to his family & fans.

    ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. అతని కుటుంబానికి & అభిమానులకు ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/dA0O5zBgxG

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పండిత పామరుల హృదయాలను గెలిచారు..

kcr on sirivennela: సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల.. పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం అన్నారు. సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం.. సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలన చిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

  • సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని అన్నారు. ఆయన మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

    — Telangana CMO (@TelanganaCMO) November 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీచూడండి: Sirivennela died: ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల ఇకలేరు

తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది..

Kishan reddy on Sirivennela: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సినీరంగంలో అనేక అవార్డుల సహా పద్మశ్రీ పొందారని గుర్తుచేసుకున్నారు. సీతారామశాస్త్రి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియజేస్తున్నానని.. సిరివెన్నెల ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని కిషన్​రెడ్డి పేర్కొన్నారు.

  • Deeply saddened by the untimely demise of one of the greatest contemporary Telugu poets & lyricists, Sri #SirivennelaSeetharamaSastry garu.

    Padma Shri Awardee & a celebrated icon in Telugu Film Industry, his literary works touched many.

    Condolences to his family.

    Om Shanti🙏🏻 pic.twitter.com/roy8WSXxMi

    — G Kishan Reddy (@kishanreddybjp) November 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు..

సిరివెన్నెల మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పాటల ద్వారా సమాజంలో చైతన్యం నింపారని కొనియాడారు. సిరివెన్నెల కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని.. సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని కేటీఆర్‌ తెలిపారు.

ఇదీచూడండి: SiriVennela Died: పాటల మాంత్రికుడు, సాహితీ విమర్శకుడు!

సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు..

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం బాధాకరమని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఆయన రాసిన ప్రతీ పాట తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిందన్నారు. ఎన్నో భావగర్భితమైన పాటలు రాసి సినీ వినీలాకాశంలో ఎన్నో తారలున్నా... చల్లని జాబిలి వెలుగులు పంచుతూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు.

  • ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అకాల మరణం బాధాకరం. ఆయన రాసిన ప్రతీ పాట తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది. ఎన్నో భావగర్భితమైన పాటలు వ్రాసి సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. pic.twitter.com/YXSmPoGBh1

    — Harish Rao Thanneeru (@trsharish) November 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గొప్ప రచయితను కోల్పోయింది..

సిరివెన్నెల మృతిపట్ల శాసన సభాపతి పోచారం పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్​కుమార్​, సత్యవతి రాఠోడ్‌, తలసాని శ్రీనివాస్​యాదవ్​, జగదీశ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ గొప్ప గేయ రచయితను కోల్పోయిందని తలసాని ఆవేదన వ్యక్తం చేశారు.

చిరస్థాయిగా నిలిచిపోతారు..

ప్రముఖ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం రాష్ట్ర ప్రజలకు సినీ పరిశ్రమకు తీరనిలోటన్నారు. సీతారామశాస్త్రి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా పాటల రూపంలో చిరస్థాయిగా ప్రజల మనసుల్లో నిలిచిపోతారని బండి సంజయ్‌ అన్నారు.

తీరనిలోటు..

సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆకస్మిక మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన మృతి.. తెలుగు సినిమా రంగానికి సాహిత్య రంగానికి తీరనిలోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. సీతారామశాస్త్రి కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్లు తెలిపారు.

సమాజంలో మార్పు కోసం కృషిచేశారు..

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సినీ రంగానికి, సమాజానికి తీరని లోటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సీతారామ శాస్త్రి అర్థవంతమైన సాహిత్యాన్ని అందించి... సమాజంలో మార్పు కోసం తీవ్రమైన కృషి చేశారన్నారు. ఆయన మాటలు, రాతలు, చేతలు త్రికరణశుద్ధిగా చేశారని పేర్కొన్నారు. ఆయన రచనలు సహజంగా ఉంటూనే విప్లవ ఆలోచనలు ప్రతిబింబిస్తాయన్నారు. వారి మృతికి ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

ఇవీచూడండి:

Last Updated : Nov 30, 2021, 7:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.