విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖకు తగిన జవాబివ్వాలని దీపం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్) విభాగానికి ప్రధానమంత్రి కార్యాలయం సూచించింది. ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కోరుతూ జగన్ ఇటీవల ప్రధానికి లేఖ రాశారు. దీన్ని దీపం విభాగానికి పంపి సీఎంకు సమాధానం ఇవ్వాలని సూచించినట్లు పీఎంవో పేర్కొంది.
ఏపీ సీఎం జగన్ రాసిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ... సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు పీఎంవో ఈ మేరకు స్పందించింది. అలాగే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీలోని కడప, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై అధ్యయనం కోసం... నియమించిన టాస్క్‌ఫోర్స్ నుంచి ఇంతవరకు తుది నివేదిక రాలేదని కేంద్ర ఉక్కు శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్.. ఏప్రిల్ 1 నుంచి అమలు