ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామ సమీపంలోని వెంగలరాయ సాగర్ వద్ద... మానవ అస్థిపంజరం కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జలాశయం ఎడమ కాల్వ తూములో మనిషి పుర్రె, కాలిన ఎముకలు బయటకు కన్పించాయి. అస్థిపంజరానికి సంబంధించిన మరికొంత భాగం గుడ్డలో కట్టి ఉంది.
తూము కాంక్రీటు శిథిలమైన కారణంగా... అందులో నుంచి ఎముకలు కన్పిస్తున్నాయి. జలాశయం నిర్మాణం జరిగిన సమయంలో మృతి చెందిన వారిని కాంక్రీటులో కలిపి పూడ్చివేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పోలీసులు స్పందించాల్సి ఉంది.
ఇవీ చూడండి: ఓట్లకోసం లక్షలు పంచుతాం కానీ.. కష్టకాలంలో ఆదుకోండి: ఎర్రబెల్లి