ఓట్లకోసం లక్షలు పంచుతాం కానీ.. కష్టకాలంలో ఆదుకోండి: ఎర్రబెల్లి
ఎన్నికల్లో గెలిచేందుకు సర్పంచుల నుంచి ఎంపీల వరకు లక్షలు ఖర్చుపెడతామని.. ఓట్లు కొనుగోలు చేస్తామంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. మహబూబాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి ఎన్నికల్లో ఓటుకు నోటుపై బహిరంగ వ్యాఖ్యలు చేశారు. కరోనా సాయంపై స్పందిస్తూ.. "గ్రామాలల్ల కూడా సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు, ప్రజా ప్రతినిధులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం నుంచి సాయం ఇస్తనే ఉన్నది. ఎమ్మెల్యేలకు,ఎంపీలకు కూడ నేను విజ్ఞప్తి చేస్తున్న. ఇప్పుడు మనకు ముఖ్యం. ఎలక్షన్లప్పుడు లక్షలకు లక్షలు ఖర్చు పెడ్తం. ఓటుకిన్ని ఇస్తం. సర్పంచ్ ఐనా. ఏ ఎలక్షన్ల ఐనా. అది ముఖ్యం కాదు. ఇయ్యాల ముఖ్యం. గ్రామాలల్ల ప్రజలకు ప్రభుత్వం నుంచి సాయం సరైన రీతిలో అందేటట్లు చూడాలె. ఇంకా పూర్తిగా విధి లేని వాళ్లెవలన్నుంటె.. మనం అరుసుకున్నప్పుడే గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. " అని ఎర్రబెల్లి అన్నారు.
మనం 'ఓటుకు నోటు' ఇస్తుంటాం.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు