ETV Bharat / city

కింది జాగ్రత్తలు పాటిస్తే.. ఉద్యోగానికి బాటలు వేసినట్లే.. - పోటీ పరీక్షలకు విద్యార్థలు సిద్ధమవుట

Students preparation: కలల ఉద్యోగాన్ని సాధించాలనేది నేటి యువత కాంక్ష.  పోస్టులు వందల్లో.. అభ్యర్థులు లక్షల్లో! పోటీ పరీక్షల బరిలో నిలవడంతో అయిపోదు, సమగ్ర ప్రిపరేషన్‌తో సంసిద్ధమైతేనే లక్ష్యం సిద్ధిస్తుంది. అందుకు తోడ్పడే ఈ ముఖ్యసూత్రాలను మీరు పాటిస్తున్నారా?కొందరికి తిన్నవెంటనే బద్ధకం ఆవహిస్తుంది. చదవడమనేది కష్టమైపోతుంది. అప్పుడు టేబుల్‌, డెస్క్‌నంతా శుభ్రం చేసుకోవడం, కాలేజ్‌ బ్యాగ్‌ను సర్దుకోవడం.. ఇలాంటి చిన్నచిన్న పనులను పూర్తిచేస్తే నిద్ర మాయమవుతుంది.

Students preparation
విద్యార్థులు తయారయ్యే పద్ధతి
author img

By

Published : Sep 9, 2022, 6:10 AM IST

Students preparation: ఏం చదువుతున్నాం, ఎంతసేపు చదువుతున్నామనేది కాకుండా ఎంత దృష్టి సారించి చదువుతున్నామన్న దానిమీదే మన విజయం ఆధారపడి ఉంటుంది. ఇందుకు చక్కని సమయప్రణాళిక అవసరం. చదువు, బోధనా నైపుణ్యాలు, అభ్యసన పద్ధతుల మీద నిత్యం ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. నేర్చుకునే క్రమంలో.. నోట్సు రాసుకోవడం, పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవడం, చదివినదాన్ని నెమరువేసుకోవడం, సమర్థంగా పునశ్చరణ (రివిజన్‌) చేసుకోవడం... అనేవి పోటీపరీక్షల్లో గెలిచేందుకు ఉపకరించే శాస్త్రీయ మార్గాలు. ఇవి అమలుచేస్తే ఉద్యోగ నియామక పరీక్షల్లోనే కాకుండా ప్రవేశపరీక్షల్లోనూ ధీమాగా విజేతగా నిలవొచ్చు.
1 ఒకేచోట, ఒకే సమయం: రష్యన్‌ ఫిజియాలజిస్ట్‌ ఇవాన్‌ పావ్లోవ్‌ చెప్పిన క్లాసికల్‌ కండిషనింగ్‌ ప్రయోగం మనకు ఏం వివరిస్తుందంటే- రోజు ఆహారం కోసం ఎదురుచూసే పెంపుడు శునకానికి, యజమాని మోగించే గంట శబ్దం ఎంతో హాయినిస్తుంది, వెంటనే లాలాజలం ఊరుతుంది. ఎందుకంటే అతను రోజు అదే సమయానికి, ఆహారాన్ని పెడుతుంటాడు. అలానే ఒకే సబ్జెక్టు/ విషయాన్ని, ఒకేచోట, ఒకే సమయంలో చదవడం వల్ల మీ మెదడు ఆ విషయం పట్ల అనుబంధాన్ని ఏర్పర్చుకుంటుంది. అదేవిధంగా చదవడానికి అలవాటు పడుతుంది. కొన్నాళ్లు పోయాక ఆ సమయం కాగానే, మీరు చదివే సబ్జెక్టు నచ్చినా, నచ్చకపోయినా చదవాలనే మూడ్‌ దానంతట అదే వచ్చేస్తుంది. ఈ ఉపాయం పోటీపరీక్షల సన్నద్ధతకు ఎంతో మేలు చేస్తుంది.
2 చెప్పిన పాఠం ఓసారి చదవటం: కళాశాలలో/ కోచింగ్‌ సంస్థలో వివరించిన పాఠ్యాంశాలు ఇంటికి రాగానే ఒకసారి చదివేయడం అలవాటు చేసుకోండి. ఆ పాఠాన్నంతా రివిజన్‌ చేసుకున్నట్లుంటుంది. చదివేటప్పుడే నోట్సు రాసుకోవడం వల్ల ఎప్పుడైనా తరగతిలో టెస్ట్‌ పెడితే తిరిగి పాఠాన్నంతా చదవాల్సిన పని ఉండదు. కాలేజీకి వెళ్లేముందే ఈ పాయింట్లు, ముఖ్యాంశాలు/ సంబంధిత బొమ్మలను చూసుకుంటే చాలు, జవాబులను తేలికగా గుర్తుచేసుకోగలుగుతారు. దీంతో సమయమూ ఆదా అవుతుంది. మీ కాలేజ్‌ టైంటేబుల్‌ను ఇంటి దగ్గర మీరు కేటాయించే స్టడీ టైంటేబుల్‌తో అనుసంధానించడం వల్ల చదివే పాఠంపై పట్టు సాధిస్తారు.
3 స్టడీ ప్లాన్‌: చదవడానికి కూర్చునేముందే మీరేం చదవాలనుకుంటున్నారో ప్రణాళిక వేసుకోండి. అలానే పరీక్ష కోసం ఏమేం చదవాలి, ఏం చదవకూడదనే అంశాల్ని తెలుసుకోవడం కూడా ఆవశ్యకం! ఆ ప్రకారమే స్టడీ ప్లాన్‌ చేసుకోండి. ఏరోజుతో మీ ప్రిపరేషన్‌ పూర్తవ్వాలనుకుంటారో అప్పటికల్లా అన్ని సబ్జెక్టులు/ సిలబస్‌ పూర్తయ్యేలా జాగ్రత్తపడండి. అలాగే పరీక్షకు ముందు రివిజన్‌ తప్పనిసరి. ఈ సన్నద్ధత ప్రణాళిక అంతా మీ మెదడులో నిక్షిప్తమై ఉండాలి. ఇది కచ్చితంగా పరీక్ష రాయడంలో సాయపడుతుంది.
4 తక్కువ సమయం- ఎక్కువ రోజులు: విద్యార్థి రోజులో 6 గంటలు అదేపనిగా చదవడంతో పోలిస్తే రోజుకొక గంట చొప్పున నాలుగురోజులపాటు చదివిందే ఎక్కువకాలం గుర్తుంటుందని మనస్తత్వశాస్త్రవేత్తల అంచనా. దీని అర్థం మీరు పక్కాగా ప్లాన్‌ చేసిన టైంటేబుల్‌లో రోజుకు 30శాతం మేర సమయం మిగిలినట్టే! తక్కువ వ్యవధిలో చదివిన విషయాలు మెదడుపై ఎక్కువకాలం ప్రభావితం చూపిస్తాయి. ఉదాహరణకు మీరు కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి ముఖ్యమైన తేదీలు, కార్యక్రమాలు, దేశాలపేర్లు- రాజధానులు, అలానే ఏదైనా ఫారిన్‌ లాంగ్వేజ్‌ లేదా గణిత సమస్యను గుర్తుంచుకోవాలనుకున్నప్పుడు 20-30 నిమిషాలపాటు ఆ విషయాల్ని చదివితే చాలు. మెదడులో నిక్షిప్తమవుతాయి. చాలావరకు ఐఐటియన్ల విషయంలో రోజు చదవడంకన్నా పరీక్ష ముందురోజు చేసిన రివిజన్‌ వల్లే పాఠాలు ఎక్కువగా గుర్తున్నట్లు తేలింది. చదివేటప్పుడు మధ్యమధ్యలో చిన్నపాటి విరామం తీసుకోవడం వల్ల మెదడు దానంతట అదే చదివిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటుందని స్పష్టమైంది. గంటలకొద్దీ చదవడంతో పోలిస్తే, తక్కువమొత్తంలో చదవగలిగేలా వేసిన ప్రణాళికలే ఉత్తమ ఫలితాలనిస్తాయి.
5 కునికిపాట్లతో చదవొద్దు: కొందరికీ పుస్తకాలు తీయగానే నిద్ర ముంచుకువస్తుంది. అలాగని ఎంతసేపూ పుస్తకాలను ముందేసుకుని కూర్చున్నా లాభం లేదు, సమయం వృథా తప్ప. కొందరికి తిన్నవెంటనే బద్ధకం ఆవహిస్తుంది. మరికొందరికి పొద్దునే లేచి చదవడమనేది కష్టమైపోతుంది. అప్పటికీ చదవాల్సిన పాఠ్యాంశాలు/ చాప్టర్‌లు పెండింగ్‌లో పడిపోతుంటాయి. అప్పుడు అవాంతరమైన కునుకును తరిమేయాలంటే- చదువుకునే చోటు, టేబుల్‌, డెస్క్‌నంతా శుభ్రం చేసుకోండి. కావాల్సిన నోట్స్‌ను సిద్ధం చేసుకోవడం లేదా కాలేజ్‌ బ్యాగ్‌ను సర్దుకోవడం.. ఇలాంటి చిన్నచిన్న పనులను పూర్తిచేస్తే నిద్ర మాయమవుతుంది. ఒకవేళ అలానే భారంగా ఉందనిపిస్తే 15 నిమిషాలపాటు చిన్న కునుకు తీయండి. ఇలా చేయడం వల్ల మీ శరీరం తేలికపడి, మెదడు ఉత్తేజితమవుతుంది.
6 రివర్స్‌ టెక్నిక్‌: మీరు ఎంతసమయం చదువుతున్నారన్నదానికంటే ఎంచుకున్న సబ్జెక్టుపై ఎంత శ్రద్ధ వహిస్తూ చదువుతున్నారన్నదే ముఖ్యం. గంటలపాటు అదేపనిగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నా... పరీక్షలో నెగ్గలేదంటే, అక్కడ గ్రహించాల్సింది ఫోకస్‌తో చదవడం ముఖ్యమని! చదువుకునే చోటు ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుందని చెప్పలేం. ఇంట్లో ఓవైపు టీవీ నడుస్తుంటుంది. ఇతరుల మాటలు మిమ్మల్ని డిస్టర్బ్‌ చెయొచ్చు. అయినా ఎటువంటి అంతరాయం కలిగినా లక్ష్యసాధన దిశగా దారులు వెతుక్కోవాలి. అందుకు సరైన సమయాన్ని ఎంచుకోవాలి. అది పొద్దునేగానీ, అర్థరాత్రి గానీ.. మీ ఫోకస్‌ చెదరకుండా ఉండటమే కీలకం. బాగా దృష్టి పెట్టి చదవాలనుకున్నప్పుడు బోర్‌ అనిపించే/ కష్టంగా ఉన్న సబ్జెక్టును ఎంచుకోండి. బద్ధకంగా అనిపించినప్పుడు బాగా ఇష్టమైన/ సులువైన సబ్జెక్టును చదవండి. ఇటువంటి రివర్స్‌ టెక్నిక్‌ వల్ల కష్టమైన సబ్జెక్టు కూడా సులభంగా వస్తుంది.
7 విభిన్న సబ్జెక్టులు: ఒకేరకమైన సబ్జెక్టులను ఒకదానితర్వాత ఒకటిగా చదవొద్దు. ఉదాహరణకు ఫిజిక్స్‌ చదివిన వెంటనే మ్యాథ్స్‌ను చదవడం ఫలితం ఇవ్వకపోవచ్చు. ఈ రెండు సబ్జెక్టుల మధ్యలో ఇంగ్లిష్‌ లేదంటే హిస్టరీలాంటి విభిన్న సబ్జెక్టును ఎంచుకోవాలి. దీనివల్ల మీ మెదడు ఈ మూడు సబ్జెక్టులనూ సమర్థంగా గుర్తుంచుకోగలదు.
8 విరామం: ప్రిపరేషన్‌లో భాగంగా రోజుకు 8-10 గంటలు కేటాయిస్తుంటారు. ఇటువంటి నిర్దిష్టమైన టైంటేబుల్‌కు కాస్త విరామం, బ్రేక్‌ తీసుకోవడమూ అవసరమే. ఈ సమయంలో కాసేపు పాటలు వినడం/ ఏదైనా ఆటలో పాల్గొనడం... మెదడునూ, శరీరాన్నీ విశ్రాంతి పొంది తాజాగా తయారయ్యేలా చేస్తుంది. ఆపై ఫోకస్‌ చెదరకుండా ఉంటుంది.

ఓకే4ఆర్‌ పద్ధతి
డా.వాల్టర్‌ పాక్‌ ప్రవేశపెట్టిన ఈ విధానం పోటీపరీక్షలకు సిద్ధమయ్యేవారికి చక్కగా ఉపయోగపడుతుంది.
అదెలాగంటే
ఓ.. ఓవర్‌వ్యూ: మీరేదైనా పాఠ్యాంశంలో కేవలం శీర్షికలు/ఉపశీర్షికలు, పరిచయ పేరా, చాప్టర్‌ చివరిలో ఉండే సమ్మరీని పైపైనే చదివేసుకోండి. దీనివల్ల ఈ చాప్టర్‌లో ఏముందనే అంశంపై ప్రాథమిక అవగాహన వస్తుంది.
కే.. కీ ఐడియాస్‌: తిరిగి చాప్టర్‌లోకి వెళ్లి, పాఠంలోని పేరాల్లో ఉన్న వాక్యాలను కీ ఐడియాలుగా మల్చండి. ప్రతి పేరాలోని మొదటి వాక్యాలు, బోల్డ్‌ చేసిన పాయింట్లు/ టేబుళ్లు/ బొమ్మలు/ ఫొటోలు/ ముఖ్యాంశాలు/ బుల్లెట్‌ పాయింట్లను కీ ఐడియాలుగా హైలైెట్‌ చేసి పెట్టుకోండి.
ఆర్‌1: రీడింగ్‌.. పాఠాన్నంతా మొదటి నుంచి చివరివరకూ ఒకసారి చదివేయండి. ఇలా పూర్తిగా విశ్లేషించుకుంటూ చదవడం వల్ల అందులోని విషయమంతా అర్థమవుతుంది.
ఆర్‌2: రీకాల్‌... ఇప్పుడు పుస్తకాన్ని పక్కనపెట్టి ఇదివరకు నోట్‌ చేసిన కీలక పాయింట్లు, శీర్షికలు, ప్రధానాంశాలన్నింటిని వరుసగా రాసుకుంటూ రండి. అలా రాసినవాటిని రీకాల్‌ చేసుకోండి. తక్షణ రీకాల్‌కు ఒకటి లేదా రెండు నిమిషాల సమయం
పడుతుంది. కానీ మీరిలా చేయడం వల్ల చదివింది ఎక్కువకాలం గుర్తుంటుంది.
ఆర్‌3: రిఫ్లెక్ట్‌... ఇప్పుడు ఈ మెటీరియల్‌ని అంతా మీ మెదడు భద్రపర్చుకుంటుంది. అది కాస్త శాశ్వత జ్ఞాపకశక్తి విభాగంలోకి వెళ్లిపోతుంది. మీరు చదివిన అంశాల ప్రాముఖ్యం తెలుసుకుని, వాటితో ఇతర అంశాలకున్న సంబంధాన్ని గ్రహిస్తే చాలు.. విషయ పరిజ్ఞానం పెరుగుతుంది.
ఆర్‌4: రివ్యూ/ రివిజన్‌... వారం మొత్తంలో మీరు చదివింది ఏ మేరకు గుర్తుందో తెలుసుకునేందుకు వారానికోసారి/ వీకెండ్‌లో మీరే స్వయంగా పరీక్ష పెట్టుకోండి. దీనివల్ల మీ నోట్స్‌ మరోసారి రివిజన్‌ చేసేందుకు వీలవుతుంది. ఇలా ఎప్పటికప్పుడు రివ్యూ/రివిజన్‌ల వల్ల నేర్చుకున్న విషయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.