ఇవాళ మృతిచెందిన ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు పార్థివదేహానికి ఆదివారం నాడు చైన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన కుటుంబసభ్యులు విదేశాల నుంచి రావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం వరకు ఆయన భౌతికకాయాన్ని ఆసుపత్రిలోనే ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి అభిమానుల సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచనున్నారు.
ఇదీ చూడండి: గొల్లపూడి జీవితాన్ని మార్చేసిన ఆ సంఘటన!