ETV Bharat / city

Golconda bonalu 2022 : భక్తజనం కదలంగ.. బోనమెత్తిన గోల్కొండ

golconda bonalu 2022 : భాగ్యనగర వాసుల ప్రియమైన పండుగ బోనాల ఉత్సవం రానే వచ్చింది. బోనాల మహోత్సవానికి గోల్కొండ వేదికగా తెరలేచింది. ఆషాఢమాసం బోనాలు చారిత్రక కోట గోల్కొండ నుంచి ప్రారంభమయ్యాయి. తొలి బోనాన్ని జగదాంబిక అమ్మవారు అందుకున్నారు. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

golconda bonalu 2022
golconda bonalu 2022
author img

By

Published : Jun 30, 2022, 1:21 PM IST

Updated : Jun 30, 2022, 7:59 PM IST

golconda bonalu 2022: రాష్ట్రానికే తలమానికమైన బోనాల పండుగ వచ్చేసింది. చారిత్రక కోట గోల్కొండ నుంచి తొలిబోనం బయల్దేరింది. గోల్కొండ వద్ద సందడిగా వేడుకలు నిర్వహించారు. పెద్దెత్తున బోనాలు సమర్పించేందుకు భక్తులు తరలివచ్చారు. పోతురాజుల విన్యాసాల ఆకట్టుకున్నాయి. భక్తులతో సందడిగా ముందుకు సాగుతూ.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌తో కలిసి సందడిగా జగదాంబిక అమ్మవారికి.. పట్టువస్త్రాలు సమర్పించారు. దీంతో వేడుకలు ప్రారంభం అయ్యాయి.

భాగ్యనగరంలో నెలరోజుల పాటు జరగనున్న బోనాల జాతర.. అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. రెండేళ్లుగా కరోనాతో సందడి కాస్త తగ్గినా.. ఈ ఏడు ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గోల్కొండ బోనాల తర్వాత లష్కర్ , లాల్ దర్వాజా, ధూల్ పేట, బల్కంపేట, పాతబస్తీ అమ్మవారి ఆలయాల్లో.. బోనాలు నిర్వహించనున్నారు. రాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో ప్రతిచోట బోనాలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని జీహెచ్​ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ప్రజలకు సూచించారు. బోనాల పండుగ జోష్‌తో భాగ్యనగరంలో.. సందడి వాతావారణం నెలకొంది.

"జులై 17, 18న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతాయి. 24, 25న లాల్ దర్వాజ బోనాలు నిర్వహిస్తాం. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో వైభవోపేతంగా బోనాల ఉత్సవం జరుపుకుంటున్నాం. కులమతాలకతీతంగా బోనాలు నిర్వహిస్తున్నాం. 10వ తేదీన బోనాలు.. బక్రీద్ వేడుకలు రెండూ జరగనున్నాయి. అందరం కలిసి ఆనందంగా ఈ పండుగలను జరుపుకుందాం."

-- తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్థకశాఖ మంత్రి

ప్రకృతి ఆరాధనకు ప్రతీక: కేసీఆర్

రాష్ట్ర పండుగైన బోనాల పండుగ’ ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పణతో నేటి నుంచి తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మాసాల్లో సంప్రదాయబద్ధంగా ఈ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతి, సాంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప సముచిత గౌరవం ఇస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని చాటిచెప్పేలా ఈ బోనాల పండుగ తెలంగాణ జీవన వైవిద్యానికి, పర్యావరణ, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు అందించాలని అమ్మవారిని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

కోలాహలంగా భాగ్యనగరం.. గోల్కొండ బోనాల తర్వాత లష్కర్, లాల్ దర్వాజ, ధూల్‌పేట, బల్కంపేట, పాతబస్తీ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాల్లో బోనాలు జరుగుతాయి. గోల్కొండ కోట నుంచి ఆరంభమైన బోనాలు.. చివరకు లాల్‌దర్వాజ అమ్మవారి వద్ద పూర్తవుతాయి. బోనాల మాసమంతా భాగ్యనగరం సందడిగా మారుతుంది. పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బోనాల వైభవం.. శివసత్తుల పూనకాలు.. అందంగా ముస్తాబైన భక్తులు.. పోతురాజుల విన్యాసాలతో గోల్కొండ కోట కోలాహలంగా మారింది.

గోల్కొండ బోనాలకు రూ.15 లక్షలు.. గోల్కొండ బోనాలకు రూ.15 లక్షల నిధులు కేటాయించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ బోనాల పండుగ జరుపుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

సంతోషంగా ఉంది.. గోల్కొండ బోనాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను వైభవంగా నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బోనాల పండుగకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించారని వెల్లడించారు. భక్తులంతా జాగ్రత్తగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని సూచించారు.

Last Updated : Jun 30, 2022, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.