ETV Bharat / city

గ్రేటర్​లో ఇంజినీరింగ్ పనుల నాణ్యతపై జీహెచ్​ఎంసీ దృష్టి - quality of engineering works

హైదరాబాద్​లో ఇంజినీరింగ్ పనుల నాణ్యతపై జీహెచ్ఎంసీ క్వాలిటీ కంట్రోల్ విభాగం చర్యలు చేపట్టింది. పలు నిర్మాణాల వద్ద తనిఖీలు నిర్వహించి.. సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి రూ. 1.55 కోట్లలను రికవరీ చేసినట్లు పేర్కొంది.

GHMC’ focus on the quality of engineering work in Greater hyderabad

author img

By

Published : Apr 25, 2021, 4:07 AM IST

గ్రేటర్​లో ఇంజినీరింగ్ పనుల నాణ్యత ప్రమాణాలపై జీహెచ్ఎంసీ క్వాలిటీ కంట్రోల్ విభాగం చర్యలు చేపట్టింది. పనుల్లో నాణ్యత లోపించడం వల్ల సదరు కాంట్రాక్టర్లకు రూ.1. 55 కోట్ల జరిమానా విధించింది. ఆయా పనులను సక్రమంగా నిర్మించేలా ఆదేశించింది. 2020 జనవరి నుంచి డిసెంబర్ వరకు జీహెచ్ఎంసీలోని ఇంజినీరింగ్ విభాగాల ద్వారా రూ. 1500 కోట్ల విలువైన పలు అభివృద్ది పనులు జరిగాయి.

మెయింటనెన్స్, ప్రాజెక్ట్స్, హౌసింగ్ విభాగాల ద్వారా జరిగిన ఈ పనులపై క్వాలిటీ కంట్రోల్ విభాగం పనులు జరిగేటప్పుడు, పూర్తయిన అనంతరం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల సందర్భంగా లోపాలను గుర్తించి సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి రూ. 1.55 కోట్లలను రికవరీ చేసింది. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ మెయింటనెన్స్ విభాగం ద్వారా జరిగిన జనరల్ పనులకు రూ. 1.34 లక్షలు, సీఆర్ఎంపీ పనులకు రూ. 6.74 లక్షలు, ప్రాజెక్ట్స్ విభాగం ద్వారా రూ. 10.60 లక్షలు, హౌసింగ్ విభాగం ద్వారా రూ. 3.23 లక్షలు పెనాల్టీని సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా రికవరీచేసి పనులను సక్రమంగా చేపట్టినట్లు జీహెచ్ఎంసీ క్వాలిటీ కంట్రోల్ విభాగం తెలిపింది.

ఇదీ చూడండి: ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.