ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు - ఈటీవీ భారత్​ టాప్​ న్యూస్​

top news
top news
author img

By

Published : Nov 11, 2021, 6:02 AM IST

Updated : Nov 11, 2021, 10:06 PM IST

21:57 November 11

టాప్ ​న్యూస్ ​@10PM

  •  కేసీఆర్​ది ఓ డ్రామా.. !

తెలంగాణ సీఎం కేసీఆర్​పై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రెస్ మీట్​లో సీఎం కేసీఆర్(CM KCR) చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడారు.

  • ఎంపీతో  ఈటల చర్చ!

తెరాస రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్‌(trs mp d srinivas)ను హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మర్యాదపూర్వకంగా(Etela Rajender meets trs MP D Srinivas) కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో డీఎస్‌(Etela Rajender meets trs MP D Srinivas)ను కలుసుకున్న ఈటల(etela rajender latest news telugu).. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు

  • 'వారి ఆక్రమణలను ఎప్పుడూ అంగీకరించలేదు'

అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా చేపట్టిన అక్రమ నిర్మాణాలను భారత్ ఎన్నడూ అంగీకరించలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఈ గ్రామాలు ఎప్పటినుంచో ఉన్నాయన్న భారత ఆర్మీ ప్రకటన నేపథ్యంలో.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పై విధంగా స్పందించారు.

  • కొత్త సినిమాల అప్ డేట్స్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో దృశ్యం 2, శ్యామ్​సింగరాయ్, మరక్కర్, రాజా విక్రమార్క, అన్నాత్తే, అసుర చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

  • ఆస్ట్రేలియా లక్ష్యం 177

దుబాయ్ వేదికగా గురువారం జరుగుతున్న మ్యాచ్​లో ఆస్ట్రేలియాకు పాకిస్థాన్ 176 పరుగుల లక్ష్యం విధించింది. రిజ్వాన్ హాఫ్ సెంచరీతో మెప్పించాడు.

20:44 November 11

టాప్ ​న్యూస్ ​@9PM

  • ఎంపీతో  భవిష్యత్తు రాజకీయాలపై చర్చ!

తెరాస రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్‌(trs mp d srinivas)ను హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మర్యాదపూర్వకంగా(Etela Rajender meets trs MP D Srinivas) కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో డీఎస్‌(Etela Rajender meets trs MP D Srinivas)ను కలుసుకున్న ఈటల(etela rajender latest news telugu).. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు

  •  కేసీఆర్​ది ఓ డ్రామా.. !

తెలంగాణ సీఎం కేసీఆర్​పై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రెస్ మీట్​లో సీఎం కేసీఆర్(CM KCR) చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడారు.

  • గవర్నర్​కు అరుదైన అవకాశం..

దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో 51వ గవర్నర్ల సదస్సు(Governors LGs conference) జరిగింది. సదస్సులో గిరిజన అభివృద్ధి, ఆరోగ్య సంబందిత అంశాల(tamilisai speech on Health & vaccination initiatives)పై గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రసంగించారు. తెలంగాణ గిరిజన ప్రజల్లో పోషకాహార లోపాన్ని గుర్తించేందుకు చేపట్టిన పైలెట్ ప్రాజెక్ట్ గురించి తమిళసై వివరించారు.

  • అంచనాలు లేకుండానే అదరగొడుతున్నారు

సెమీస్​లో ఇంగ్లాండ్​పై విజయం సాధించింది ఫైనల్​కు (T20 World Cup 2021) దూసుకెళ్లిన న్యూజిలాండ్​ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు ప్రదర్శనపై ప్రస్తుత క్రికెటర్​లు, మాజీలు కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ట్విట్టర్​ వేదికగా కివీస్​కు శుభాకాంక్షలు తెలిపారు.

  •  ఆ దేశంలో స్టార్ చిత్రాల ఈవెంట్స్ !

టాలీవుడ్​కు దుబాయ్​ పబ్లిసిటీ హబ్​గా మారనుంది. భారీ బడ్జెట్​ సినిమాలైన ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాల ఈవెంట్స్​ను ఆ దేశంలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

19:52 November 11

టాప్ ​న్యూస్ ​@8PM

  •  కేసీఆర్​ది ఓ డ్రామా

 తెలంగాణ సీఎం కేసీఆర్​పై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రెస్ మీట్​లో సీఎం కేసీఆర్(CM KCR) చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడారు.

  • తెరాస ఎంపీతో ఈటల 

తెరాస ఎంపీతో ఈటల రాజేందర్​ భేటీ అయ్యారు. రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

  • పెళ్లి వేడుకలో సీఎం

తీగుల్ల వారి ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఉప సభాపతి పద్మారావు గౌడ్​ కుమార్తె వివాహం(padma rao goud daughter marriage).. సికింద్రాబాద్​లోని ఇంపీరియల్​ గార్డెన్స్​లో వైభవంగా జరిగింది. 

  • అక్కడ 'సినిమా' బంద్​.!

దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించిన అరియానా థియేటర్ మూతపడింది. అమెరికన్ యాక్షన్ చిత్రాలు, బాలీవుడ్ సినిమా పోస్టర్లతో కళకళలాడే ఆ థియేటర్ ప్రస్తుతం వెలవెలబోతోంది. 

  •  ఆ దేశంలో స్టార్ చిత్రాల ఈవెంట్స్ !

టాలీవుడ్​కు దుబాయ్​ పబ్లిసిటీ హబ్​గా మారనుంది. భారీ బడ్జెట్​ సినిమాలైన ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాల ఈవెంట్స్​ను ఆ దేశంలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

18:42 November 11

టాప్ ​న్యూస్ ​@7PM

  • బీ అలర్ట్.. భారీ వర్షాలు..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains in Andhra Pradesh) కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఈదురు చలి గాలులు వీస్తున్నాయి.

  • క్షమాపణలు చెప్పాలి

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన అన్ని ప్రయోజనాలను కల్పించాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి మంత్రి హరీశ్​రావు సూచించారు. ఎయిమ్స్​కు రాష్ట్ర ప్రభుత్వం స్థలమే ఇవ్వలేదని కిషన్​రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు కిషన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు

  •  భారీగా డ్రగ్స్ పట్టివేత..!

14.2 కిలోల సూడో ఎపిడ్రిన్‌ను (మత్తు మాత్రలు) (Drugs Seized in Hyderabad) స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్​ సీపీ అంజినీకుమార్​ వెల్లడించారు. ఫొటో ఫ్రేమ్స్​లో పెట్టి ప్యాకింగ్​ చేసి, ఆస్ట్రేలియా పంపేందుకు ఏర్పాట్లు చేస్తుండగా దాడులు చేసినట్లు తెలిపారు.

  • డాక్టర్​​పై​ వేటు- అదే కారణం!

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​కు చెందిన పిల్లల వైద్యుడు కఫీల్​ ఖాన్​ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2017లో బీఆర్​డీ వైద్య ఆసుపత్రిలో ఆక్సిజన్​ కొరత కారణంగా 70మంది చిన్నారులు మరణించిన ఘటనకు బాధ్యుడ్ని చేస్తూ ఈమేరకు చర్యలు చేపట్టింది.

  • మరోసారి 'దంగల్'​కు గీతా ఫొగాట్

మహిళా స్టార్​ రెజ్లర్​ గీతా ఫొగాట్ రెజ్లింగ్​లో రీఎంట్రీకి సిద్ధమవుతుంది. పారిస్​ ఒలింపిక్సే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నట్లు వెల్లడించింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత గీత.. మళ్లీ రెజ్లింగ్​లోకి అడుగుపెడుతోంది.

17:46 November 11

టాప్ ​న్యూస్ ​@6PM

కేంద్రమంత్రి క్షమాపణలు చెప్పాలి

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన అన్ని ప్రయోజనాలను కల్పించాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి మంత్రి హరీశ్​రావు సూచించారు. ఎయిమ్స్​కు రాష్ట్ర ప్రభుత్వం స్థలమే ఇవ్వలేదని కిషన్​రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు కిషన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు.

  • ట్యాబ్లెట్ల రూపంలో.. ఫొటో ఫ్రేమ్స్​లో...!

14.2 కిలోల సూడో ఎపిడ్రిన్‌ను (మత్తు మాత్రలు) (Drugs Seized in Hyderabad) స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్​ సీపీ అంజినీకుమార్​ వెల్లడించారు. ఫొటో ఫ్రేమ్స్​లో పెట్టి ప్యాకింగ్​ చేసి, ఆస్ట్రేలియా పంపేందుకు ఏర్పాట్లు చేస్తుండగా దాడులు చేసినట్లు తెలిపారు.

  • '2014లోనే  అసలైన స్వాతంత్ర్యం'

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశానికి 1947లో కాకుండా.. 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం లభించిందని ఆమె అన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. రాజకీయ దుమారం చెలరేగింది. ఆమె వ్యాఖ్యలను ఖండించిన భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ.. ఈ తరహా ఆలోచనను పిచ్చితనంగా భావించాలా లేదా దేశద్రోహంగా పరిగణించాలా అని మండిపడ్డారు.

  • 'డెల్టా'లో వరద బీభత్సం

తమిళనాడు డెల్టా ప్రాంతంలో వర్షాలు(tamil nadu rains) బీభత్సం సృష్టించాయి. దాదాపు 1.5లక్షల ఎకరాల పంట నాశనమైపోయింది. చేతికంది వచ్చిన పంట నీటమునగడం చూసి రైతన్నలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పంట నష్టంపై కమిటీని ఏర్పాటు చేశారు సీఎం.

  •  ఆమె ఏ పెళ్లికి వెళ్లినా ఈ పాట పక్కా!

'నగిరి' ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. ఆ నియోజకవర్గంలో ఏ పెళ్లికి వెళ్లినా సరే ఓ పాట కచ్చితంగా ప్లే చేస్తారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పారు. ఇంతకీ ఆ సాంగ్ ఏంటంటే?

16:52 November 11

టాప్ ​న్యూస్ ​@5PM

  •  భారీగా డ్రగ్స్ పట్టివేత..!

14.2 కిలోల సూడో ఎపిడ్రిన్‌ను (మత్తు మాత్రలు) (Drugs Seized in Hyderabad) స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్​ సీపీ అంజినీకుమార్​ వెల్లడించారు. ఫొటో ఫ్రేమ్స్​లో పెట్టి ప్యాకింగ్​ చేసి, ఆస్ట్రేలియా పంపేందుకు ఏర్పాట్లు చేస్తుండగా దాడులు చేసినట్లు తెలిపారు.

  • 'ప్రభుత్వానికి, ప్రజలకు మార్గదర్శిగా ఉండాలి'

దిల్లీలో 51వ గవర్నర్ల సదస్సు జరిగింది. దీనికి రాష్ట్రపతి అధ్యక్షత వహించారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఓ స్నేహితుడిగా, తత్వవేత్తగా, మార్గదర్శిగా గవర్నర్‌లు ఉంటారని రాజ్యాంగ నిర్మాతలు భావించినట్లు రామ్​నాథ్ కోవింద్ తెలిపారు.

  •  పోలీసుల కర్కశత్వం..! 

సూర్యాపేట జిల్లా(suryapet district) ఆత్మకూరు(ఎస్‌) పోలీసుల తీరుపై(police attack) విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రాత్రి రామోజీతండాకు(ramoji Thanda) చెందిన యువకుడిని పీఎస్​కు తీసుకెళ్లి చితకబాదడంతో తండా వాసులు ఆందోళనకు దిగారు. 

  • ఆ నటికి త్వరలో పెళ్లి?

తనకు కాబోయే వాడి గురించి త్వరలో అందరికీ తెలుస్తుందని నటి కంగనా రనౌత్ చెప్పింది. ఇటీవల ఈమెను అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డు వరించింది.

  • మరోసారి 'దంగల్'​కు గీతా ఫొగాట్

మహిళా స్టార్​ రెజ్లర్​ గీతా ఫొగాట్ రెజ్లింగ్​లో రీఎంట్రీకి సిద్ధమవుతుంది. పారిస్​ ఒలింపిక్సే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నట్లు వెల్లడించింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత గీత.. మళ్లీ రెజ్లింగ్​లోకి అడుగుపెడుతోంది.

15:41 November 11

టాప్ ​న్యూస్ ​@4PM

  •  పోలీసులు తీరుపై ధర్నా

సూర్యాపేట జిల్లా(suryapet district) ఆత్మకూరు(ఎస్‌) పోలీసుల తీరుపై(police attack) విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రాత్రి రామోజీతండాకు(ramoji Thanda) చెందిన యువకుడిని పీఎస్​కు తీసుకెళ్లి చితకబాదడంతో తండా వాసులు ఆందోళనకు దిగారు.

  • భయం లేకుండా పనిచేయండి.. !

రాష్ట్ర ప్రయోజనాల కోసం భయం లేకుండా, విధేయతతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news).. తనకు సూచించారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. దిల్లీలో మోదీతో 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు.

  • మహిళా పోలీసు సాహసం..!

వరదలు సృష్టించిన బీభత్సంతో(tamil nadu rain) అల్లాడుతున్న చెన్నైలో సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి(tamil nadu rain updates). టీపీ చత్రం పోలీస్​ స్టేషన్​ ఇన్​స్పెక్టర్​ రాజేశ్వరి స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 

  • 'నాకు పెళ్లి ఎప్పుడవుతుందో'..!

పూర్ణ, పాయల్ రాజ్​పుత్, ఈషారెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ '3 రోజెస్'. దీని ట్రైలర్​ గురువారం రిలీజ్​ కాగా.. అభిమానుల్ని అలరిస్తూ అంచనాల్ని పెంచుతోంది.

  • ' ఆ జట్టు విజయాలకు కారణం అతడే'

టీ20 ప్రపంచకప్​లో న్యూజిలాండ్​ జట్టు ప్రదర్శనపై మాజీ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టు అలా విజయాలు సాధించడంలో కెప్టెన్​ కేన్​ విలియమ్సన్‌ ప్రధాన పాత్ర పోషించాడని.. ప్రస్తుత క్రికెటర్లలో అతనో లెజెండ్‌ అని అన్నాడు.

14:35 November 11

టాప్ ​న్యూస్ ​@3PM

  • విద్యార్థులకు కరోనా 

రాష్ట్రంలో కరోనా(Corona third wave in Telangana) మరోసారి విలయతాండవం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో విద్యార్థులపై తన పంజా(Corona cases in Nalgonda district) విసరడం మొదలుపెట్టింది. ఇప్పటికే 15 మంది విద్యార్థులు.. ఇద్దరు ఉపాధ్యాయులకు సోకిన మహమ్మారి(students tested corona positive) తాజాగా మరో ఏడుగురిపై తన ప్రతాపం చూపించింది.

  • వారికి హైకోర్టు నోటీసులు..!

అడవితల్లిని నమ్ముకుని బతికే గిరిజనులు భూముల హక్కుల కోసం ఏళ్ల తరబడి ఎడతెగని పోరాటం(Podu farmers fight) చేస్తున్నారు. తాతల తరాల నుంచి సాగు చేసుకునే భూములను సర్కార్ లాక్కోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి పెద్ద యుద్ధమే(Podu farmers fight) జరుగుతోంది. 

  • 'మీ స్ఫూర్తితోనే నిర్మూలన'

దేశంలో కరోనా నిర్మూలనకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సహకార స్ఫూర్తితో పని చేయాలని పేర్కొన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ. పలు దేశాల్లో కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన.. వైరస్ తీవ్రత ముగిసినట్లు భావించకూడదన్నారు. టీకాల పంపిణీని మరింత వేగవంతం చేయాలని సూచించారు.

  • పట్టాలు తప్పిన గూడ్స్​ 

ఉత్తర్‌ప్రదేశ్‌ జాన్​పుర్​లోని బద్లాపుర్​-శ్రీ కృష్ణా నగర్​ స్టేషన్ మార్గంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం సుమారు 7.30 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 21 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి

  • హీరోయిన్​పై నిర్మాత హాట్​ కామెంట్​!

కెరీర్​లో ఎదుర్కొన్న(mallika sherawat updates) ఓ వింత అనుభవం గురించి బాలీవుడ్​ నటి మల్లికా శెరావత్ చెప్పింది​. నడుముపై చపాతీ కాల్చగలిగేంత హాట్​గా ఉన్నానని ఓ నిర్మాత తనతో అన్నట్లు గుర్తుచేసుకుంది.

14:21 November 11

టాప్ ​న్యూస్ ​@2 PM

  • మరో ఏడుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్

రాష్ట్రంలో కరోనా(Corona third wave in Telangana) మరోసారి విలయతాండవం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో విద్యార్థులపై తన పంజా(Corona cases in Nalgonda district) విసరడం మొదలుపెట్టింది. ఇప్పటికే 15 మంది విద్యార్థులు.. ఇద్దరు ఉపాధ్యాయులకు సోకిన మహమ్మారి(students tested corona positive) తాజాగా మరో ఏడుగురిపై తన ప్రతాపం చూపించింది.

  • ధాన్యం కొనుగోళ్లపై భాజపా ధర్నాలు

వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద భాజపా కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు(BJP protest over paddy purchase) చేపట్టారు. తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనాలంటూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద భాజపా శ్రేణులు చేపట్టిన ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీశాయి.

  • జలదిగ్బంధంలో చెన్నై

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు (floods in tamilnadu) అతలాకుతలం అవుతోంది. సాధారణ జనజీవనం స్తంభించింది. చెన్నైలో పలు కాలనీలు, ఆస్పత్రులు నీటిమయమయ్యాయి. రహదారులపై మోకాలు లోతులో వరద ప్రవాహం కొనసాగుతోంది. వర్షాల కారణంగా రాష్ట్రంలో 4 రోజుల్లో 91 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • పట్టాలు తప్పిన గూడ్స్​ .. 21 బోగీలు చెల్లాచెదురు

ఉత్తర్‌ప్రదేశ్‌ జాన్​పుర్​లోని బద్లాపుర్​-శ్రీ కృష్ణా నగర్​ స్టేషన్ మార్గంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం సుమారు 7.30 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 21 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా సమయంలో వచ్చిన భారీ శబ్దానికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

  • ప్రభాస్​ హీరోయిన్​గా కొరియన్​ భామ!

ప్రభాస్​ 'స్పిరిట్'​(spirit movie prabhas heroine) సినిమాలో దక్షిణకొరియా భామ సాంగ్​ హై కో నటించనుందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ నటించట్లేదని సినీవర్గాల టాక్​.

12:42 November 11

టాప్ ​న్యూస్ ​@1 PM

  • తమిళనాడు వర్షాలు : 4 రోజుల్లో 91 మంది మృతి..

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. సాధారణ జనజీవనం స్తంభించింది. చెన్నైలో పలు కాలనీలు, ఆస్పత్రులు నీటిమయమయ్యాయి. రహదారులపై మోకాలు లోతులో వరద ప్రవాహం కొనసాగుతోంది. వర్షాల కారణంగా రాష్ట్రంలో 4 రోజుల్లో 91 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • పాదయాత్రలో ఉద్రిక్తత.. లాఠీఛార్జ్‌లో విరిగిన రైతు చేయి

ఏపీలోని ప్రకాశం జిల్లా చదలవాడలో రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చేయి విరిగింది. ఉద్రిక్తత కారణంగా రైతుల పాదయాత్రకు అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. యాత్రలో పాల్గొనేందుకు పెద్దఎత్తున వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ  పోలీసులను తోసుకుంటూ ప్రజలు యాత్రలో పాల్గొంటున్నారు.                     

  • అవి భారత్​లో విధ్వంసానికేనా?

అమెరికా బలగాలు అఫ్గానిస్థాన్​ను వీడుతూ భారీగా అధునాతన ఆయుధాలను(us military weapons used in afghanistan) వదిలేసి వెళ్లాయి. వాటిని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు పాకిస్థాన్​కు విక్రయిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఆ ఆయుధాలను భారత్​లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్​ఐ కనుసన్నల్లోని ఉగ్రసంస్థలకు అప్పగించే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాయి.

  • ఇండోనేషియాలో వివాహేతర జంటకు కఠిన శిక్ష!

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంటకు షరియా చట్టం ప్రకారం (Sharia Law Punishment) అధికారులు కఠిన శిక్ష విధించారు. ఈ ఏడాది ఆగస్టులో అరెస్టు చేసిన వీరిని దోషులుగా తేల్చి.. కర్రలతో దండించారు. మూడు నెలల జైలు శిక్ష సైతం విధించారు.

  • ఇండోనేసియాలో భారీ భూకంపం

ఇండోనేసియాను మరోమారు భారీ భూకంపం(earthquake indonesia) వణికించింది. తూర్పు ప్రాంతంలోని పపువా బరాత్​ రాష్ట్రంలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించినట్లు ఆ దేశ వాతావరణ, భూగోళ శాస్త్ర విభాగం వెల్లడించింది. అయితే, సునామీ సూచనలేమీ కనిపించలేదని తెలిపింది.

  • యునెస్కో గుర్తించినా... పట్టాలెక్కని ప్రగతి

తెలుగు రాష్ట్రాల్లోనే యునెస్కో గుర్తింపు దక్కించుకున్న ఏకైక కట్టడం రామప్ప ఆలయం. కాకతీయుల కళా వైభవానికి అరుదైన గుర్తింపు దక్కడంతో ప్రపంచమే ఓసారి రామప్ప వైపు చూసింది. దేశమంతా హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొంది ఇప్పటికే మూడు నెలలు దాటింది. గుర్తింపు ఇచ్చే సమయంలో యునెస్కో కొన్ని షరతులు విధించింది. దాని ప్రకారం ఆలయంలో ఏ పనులు జరగట్లేదు. ఇప్పటికైనా యునెస్కో సూచించిన అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

  • పెళ్లి మండపంలోనే వధూవరుల నేత్రదానం

కళ్లు మూసుకొని ఒక్క అడుగు వేసేందుకే ఇబ్బందులు పడతాం. అలాంటి ఎంతో మంది ఈ ప్రపంచాన్ని చూడలేకపోతున్నారు. అలాంటివారికి చూపును ప్రసాదించడానికి కర్ణాటకకు చెందిన ఓ కొత్తజంట (eye donation in karnataka) పెళ్లి వేడుకలోనే నేత్రదానం చేసింది. ఫంక్షన్​ హాల్​లోనే నేత్రదాన శిబిరం నిర్వహించి మరెందరికో స్ఫూర్తిగా నిలిచింది.'

11:51 November 11

టాప్ ​న్యూస్ ​@12 PM

  • రాష్ట్రపతితో గవర్నర్ల సమావేశం

గవర్నర్ల 51వ సమావేశం దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ భేటీకి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ నేతృత్వం వహించారు.

  • పీఓకేలో చైనా సైనికుల సంచారం.

చైనా సైన్యం పాకిస్థాన్​తో కలిసి పీఓకేలో (China army in Pakistan) సర్వేలు నిర్వహించింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పలు ప్రాంతాల్లో (China PLA Army news) పర్యటించింది. పాక్ సైనిక వ్యవస్థను బలోపేతం చేయడం సహా సరిహద్దు వెంబడి నమూనా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

  • అన్నంత పని చేసిన మస్క్

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌.. తన ట్విట్టర్ అనుచరులు సూచించినట్లే టెస్లా షేర్లను విక్రయించారు. పన్ను చెల్లించేందుకు 1.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,187 కోట్లు) విలువైన 9 లక్షల షేర్లను విక్రయించారు.

  • రూ.50 వేలు దాటిన బంగారం ధర

బంగారం (Gold Price today), వెండి ధరలు గురువారం భారీగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.780, కిలో వెండిపై ఏకంగా రూ.1,238 పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ​తెలంగాణలో పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  •  పాకిస్థాన్ ఫేవరెట్.. ఆసీస్​తో ప్రమాదమే'

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021) సెమీఫైనల్లో భాగంగా నేడు (నవంబర్ 11) ఆస్ట్రేలియాతో తలపడనుంది పాకిస్థాన్(pak vs aus t20). ఈ మ్యాచ్​పై స్పందించిన టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప(robin uthappa news).. ఇందులో గెలిచే అవకాశం పాక్​కే ఎక్కువగా ఉందని తెలిపాడు.

10:53 November 11

టాప్ ​న్యూస్ ​@11AM

  • దేశంలో విజృంభిస్తున్న కరోనా

భారత్​లో కరోనా కేసులు (India covid cases) స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 13,091 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్​ ధాటికి మరో 340 మంది మరణించారు.

  • రూ. 1.14 కోట్ల విలువైన గంజాయి సీజ్

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారం హద్దూ అదుపూ లేకుండా సాగుతోంది. గంజాయి ముఠాలు విచ్చలవిడిగా తమ దందాను కొనసాగిస్తున్నాయి. పోలీసులు కూడా తమదైన శైలిలో తనిఖీలు చేస్తూ... గంజాయిని పట్టుకుంటున్నారు. దీనిలో భాగంగా ఖమ్మంలోని సత్తుపల్లిలో బుధవారంలో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • ఆటోను ఢీకొన్న ట్రక్కు- తొమ్మిది మంది మృతి!

అసోంలోని కరీమ్​గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు ఆటోను ఢీకొన్న ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీరిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నట్లు సమాచారం. 

  • డిసెంబర్ నుంచి అమెరికా పర్యాటక వీసాలు

అమెరికా పర్యటన(American Tourist Visas)కు వెళ్లాలనుకుంటున్న వారికి శుభవార్త. డిసెంబర్ నుంచి అమెరికా పర్యాటక వీసాలు జారీ చేయనున్నట్లు దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో వీసా వ్యవహారాలు పర్యవేక్షించే మినిస్టర్ కౌన్సెలర్ డాన్ హెఫ్లిన్ తెలిపారు. అగ్రరాజ్యానికి వెళ్లేందుకు ఉన్న ఆంక్షలను గత సోమవారం పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో వీసా వ్యవహారాలపై ఉన్న సందేహాలను ఆయన ఫేస్​బుక్ వేదికగా నివృత్తి చేశారు.

  • మాలిక్, రిజ్వాన్​కు అస్వస్థత

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో భాగంగా సెమీఫైనల్ మ్యాచ్​లో నేడు (నవంబర్ 11) ఆస్ట్రేలియాతో తలపడనుంది పాకిస్థాన్. ఈ కీలకపోరు ముందు పాక్​ ఆటగాళ్లు షోయబ్ మాలిక్(shoaib malik news), మహ్మద్ రిజ్వాన్ అస్వస్థతకు గురవడం జట్టును కలవరపెడుతోంది.

09:36 November 11

టాప్ ​న్యూస్ ​@10AM

  • ఆస్పత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు

ఆస్పత్రుల్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలు (Fire Accidents in hospitals) అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్వస్థత పొంది క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాల్సిన సురక్షితమైన చోటే ఇలాంటి ప్రమాదాలు జరగడం నివ్వెరపరుస్తున్నాయి. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా నగరాల్లో వెలుగుచూస్తున్నాయి. పుణెలోని 20 ప్రభుత్వ ఆస్పత్రులకు అగ్నిమాపక నిరభ్యంతర పత్రాలు లేవని, భద్రతా ప్రమాణాలు ఉల్లంఘిస్తున్నందుకు 206 వైద్యాలయాలకు కేరళ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందన్న కథనాలు- ఎక్కడికక్కడ పేరుకుపోయిన అవ్యవస్థకు తార్కాణాలు.

  • గ్యాస్‌ ఆన్ చేస్తుండగా.. పేలిన సిలిండర్

అసలే చలికాలం. పైగా ఉదయమే కుళాయి నీరు మంచు గడ్డలను తలపించేలా ఉంటుంది. వయసు పైబడిన ఆమె చలిని తట్టుకోలేమని... స్నానం చేసేందుకు వేడినీళ్లు పెట్టుకుందామనుకుంది. కానీ గ్యాస్​ ఆన్​ చేసిన వెంటనే సిలిండర్​ బ్లాస్ట్ జరిగి తీవ్రగాయాల పాలైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని మెట్​పల్లి బోయవాడలో చేసుకుంది. 

  • 10వేల ఏళ్ల క్రితం నుంచే శనగలున్నాయట!

భారతీయ వంటకాల్లో సెనగలు(Chickpea crop in India), సెనగపప్పు(Chana dal) వాడని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. భారత్‌లోనే కాదు.. దేశదేశాల్లో వందల కోట్ల మంది నిత్యాహారంలో వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా సాగుచేస్తున్న పప్పుధాన్యాల పంటల్లో సెనగది మూడోస్థానం. ఈ పంటపై హైదరాబాద్‌లోని ‘ఇక్రిశాట్‌’ ఆధ్వర్యంలో 41 అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు సంయుక్తంగా శోధించి సెనగ జన్యుపటాన్ని ఆవిష్కరించాయి.

  • హై..హై.. నైకా

దేశీయంలో అత్యంత సంపన్న మహిళల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు నైకా (Nykaa) వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్. నైకా షేర్లు.. పెట్టుబడికి దాదాపు సమాన ప్రతిఫలాన్ని అందిస్తూ.. స్టాక్‌మార్కెట్లలో శుభారంభం చేశాయి. దీంతో ఫల్గుణి ఈ ఘనత సాధించారు.

  • ఐపీఎల్​లో అదరగొట్టి.. టీమ్ఇండియాకు ఎంపికై!

ఐపీఎల్( ipl 2021 news) ద్వారా ప్రతి ఏడాది కొత్త కుర్రాళ్లు మెరుపులు మెరిపిస్తూనే ఉంటారు. సెలెక్టర్ల దృష్టిలో పడుతుంటారు. తాజాగా త్వరలో న్యూజిలాండ్​తో జరగబోయే సిరీస్ కోసం కూడా కొంతమంది కుర్రాళ్లు ఎంపికయ్యారు. వారంతా ఐపీఎల్​లో అదరగొట్టిన వారే.

09:00 November 11

టాప్ ​న్యూస్ ​@9AM

  • బైకుల్లో 450 కిలోల గంజాయి తరలింపు

మేడ్చల్ జిల్లా పరిధిలోని కౌకుర్ దర్గా వద్ద భారీగా గంజాయి(cannabis seized in medchal) పట్టుబడింది. రెండు ద్విచక్రవాహనాల్లో తరలిస్తున్న 450 కిలోల గంజాయి(450 kilograms of cannabis seized in medchal)ని ఆబ్కారీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోటి రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

  •  జ్వలిస్తున్న మహాపాదయాత్ర!

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర(amaravati farmers maha Padayatra ) ఉద్ధృతంగా ముందుకు సాగుతోంది. గురువారానికి పదకొండో రోజుకు చేరిన యాత్ర.. నేడు ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు నుంచి ముక్తినూతలపాడు వరకు కొనసాగనుంది. రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అన్ని వర్గాల వారు సంఘీభావం తెలుతున్నారు. కాగా.. పాదయాత్రలో పాల్గొనకుండా.. చిలకలూరిపేటలో గొట్టిపాటి రవికుమార్‌, మార్టూరులో ఏలూరి సాంబశివరావులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

  • వణుకుతున్న రైతులు..

అందరికి అన్నం పెట్టే రైతునే.. అన్నమో రామచంద్రా అనిపిస్తున్నారు. ఎముకలు కొరికే చలి.. ఎటు చూసినా చిమ్మచీకట్లు.. మధ్యలో భౌ.. భౌమంటూ భయపెట్టే ఊరకుక్కలు.. పారాడే విషకీటకాలు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కర్షకులు అరిగోస పడుతున్నారు. మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం అటవీ జంతువులు- దొంగల పాలవ్వకుండా రాత్రిపూట ఆరోగ్యాన్ని లెక్కచేయక కాపాలాకాస్తున్నారు. సమయానికి తిండి లేక.. కంటి నిండా నిద్ర కరవై.. అనారోగ్యం పాలై ప్రాణాలు పోతున్నా ఆదుకునేవారు లేరు. మంగళవారం రాత్రి కొనుగోలు కేంద్రాల్లో పరిశీలన చేయగా.. వారుపడుతున్న అవస్థలు కంటతడి పెట్టించాయి.

  • టీకా వేసుకుంటేనే రేషన్‌, గ్యాస్‌, పెట్రోల్‌!

వ్యాక్సిన్‌ కార్యక్రమం మందకొడిగా సాగుతున్న (maharastra vaccination rate) నేపథ్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కనీసం టీకా ఒక డోసు వేసుకున్నవారికి మాత్రమే రేషన్‌, పెట్రోల్‌, గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయాలని డీలర్లు, ఏజెన్సీలకు ఆ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

  • చిరు 'భోళాశంకర్'​  షూటింగ్​ షురూ

చిరంజీవి కథనాయకుడిగా నటిస్తున్న 'భోళాశంకర్'(chiranjeevi bhola shankar movie remake)​ సినిమా షూటింగ్​ పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది(chiranjeevi bhola shankar). ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేశ్, హీరోయిన్​గా తమన్నా నటించనున్నారు.

07:55 November 11

టాప్ ​న్యూస్ ​@8AM

  • తప్పుడు ధ్రువపత్రాలతో బ్యాంకుకు టోకరా

తప్పుడు ధ్రువపత్రాల(Fake Documents)తో భూమి తనఖా పెట్టి బ్యాంకు నుంచి కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. అవే పత్రాలను వేర్వేరు చోట్ల తనఖా పెట్టి నిబంధనలకు విరుద్ధంగా వారే నెలకొల్పిన వేర్వేరు సంస్థల్లోకి నిధులు మళ్లించారు. చివరకు కటకటాలపాలయ్యారు. తప్పుడు ధ్రువపత్రాలతో రూ.15 కోట్ల రుణం తీసుకుని బ్యాంకును మోసం చేసిన ఘటనలో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  •  'నేనూ అల్లర్ల బాధితుడినే'

మత కల్లోలాలు వ్యవస్థీకృతమైన హింస వంటివని పేర్కొన్నారు సీనియర్‌ న్యాయవాది, కాంగ్రెస్​ నేత కపిల్‌ సిబల్‌. మత హింసను లావాతో పోల్చారు. లావా నేలపై పారినప్పుడు అది మంటతో పాటు, మరకను మిగుల్చుతుందన్నారు. భవిష్యత్తులో ప్రతీకారాలు తీర్చుకోవడానికి సారవంతమైన భూమిగా మారుతుందని.. తానూ బాధితుడినేనని సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు సిబల్‌.

  • సామాన్య భారతీయుడికి సెయింట్‌హుడ్‌ హోదా

కేరళకు చెందిన దేవసహాయం పిళ్లైకి.. పోప్‌ ఫ్రాన్సిస్‌ సెయింట్‌హుడ్‌ హోదాను ప్రకటిస్తారని తిరువనంతపురంలోని చర్చి అధికారులు తెలిపారు. ఈ మేరకు వాటికన్‌లో మంగళవారం ప్రకటన వెలువడినట్లు చెప్పారు.

  • ద్రవ్యోల్బణ అంచనా చేరుకుంటాం

దేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన జీడీపీ 9.5 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. వృద్ధి పెరిగేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పారు.

  • అది బీసీసీఐ చేతుల్లోనే ఉంది!

ఇకపై ఆటగాళ్లపై ఒత్తిడిని గమనించి బీసీసీఐ(bcci news) వారికి విశ్రాంతిని ఇవ్వనుందని తెలుస్తోంది. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం. వరుసగా మ్యాచ్‌లు ఆడి అలసిపోవడం టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021)లో టీమ్‌ఇండియా వైఫల్యానికి ఓ ముఖ్య కారణమన్న విమర్శలు బలంగా వినిపించిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందట.

07:13 November 11

టాప్ ​న్యూస్ ​@7AM

  • ఆరోగ్య సూచీలకు వచ్చే నెలలో శ్రీకారం...

ప్రజల ఆరోగ్య ముఖచిత్రాన్ని భద్రపరిచే కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. క్షేత్రస్థాయిలో వైద్యసిబ్బంది ఇంటింటా పరీక్షలు నిర్వహించడానికి ఇదే సరైన సమయమని వైద్యశాఖ భావిస్తోంది. 

  • రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు..

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల కోసం దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు ఎంపికయ్యాయి (Swachh survekshan 2021). తెలంగాణలోని తొమ్మిది మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులకు ఎంపికయ్యాయి.

  • తమిళనాడును వదలని వర్షాలు..

తమిళనాడులో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12కు చేరింది. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నవంబర్ 10, 11 తేదీల్లో సెలవును ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. 

  • పాటకు పట్టం కట్టిన పద్మవిభూషణుడు..

అసమాన ప్రతిభా పాటవాలతో వేలాది పాటలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు. తెలుగు పాట ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సంగీత విద్వాంసుడు. ఆయనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని బాలూ తనయుడు ఎస్పీ చరణ్​ అక్టోబర్ ​9న అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఓసారి ఎస్పీబీని స్మరించుకుందాం.

  • పాక్‌ను ఆపతరమా?..

టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021)లో ఆసక్తికర సమరానికి వేళైంది. జోరుమీదున్న పాకిస్థాన్‌ గురువారం (నవంబర్ 11) జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా(aus vs pak t20 2021)ను ఢీకొంటుంది. పాకిస్థాన్‌ ఎవరూ ఊహించని విధంగా టోర్నమెంట్లో అదిరే ప్రదర్శన చేసింది. 

04:30 November 11

టాప్ ​న్యూస్ ​@6AM

  • వీడని జోనల్​ పీటముడి

రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానం అమలు ప్రక్రియలో ముందడుగు పడటం లేదు . ఇప్పటివరకు జిల్లా, జోనల్‌, బహుళ జోనల్‌ వారీగా ఉద్యోగుల విభజన మాత్రమే జరగగా, ఉద్యోగుల సంఖ్య ఖరారులో, జోన్ల వారీగా బదలాయింపుల్లో జాప్యం జరుగుతోంది. దీనిపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

  • కొలిక్కి వచ్చిన జాబితా..

ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కొలిక్కి వచ్చింది (mla quota mlc elections). శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను నేడో, రేపో ప్రకటించనున్నారు.

  • అధికారంలోకి రావడమే లక్ష్యంగా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులకు కాంగ్రెస్‌ నాయకులు దిశానిర్దేశం చేశారు (congress political training). హైదరాబాద్‌ కొంపల్లిలో జరిగిన రెండ్రోజుల శిక్షణా తరగతుల్లో.... పార్టీ బలోపేతం కోసం భవిష్యత్ కార్యాచరణ, పార్టీ భావజాలాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంపై ఎక్కువ దృష్టి సారించారు. 

  • 'వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లు'

ఆర్టీసీ సంస్థకు కండక్టర్లు, డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లు అని ఆ సంస్థ ఎండీ సజ్జనార్​ అన్నారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్​ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారిగా సిబ్బందితో సమావేశం నిర్వహించారు (rtc md sajjanar review). 

  • గుప్పుమంటున్న గంజాయి

దేశంలో గంజాయి వినియోగం రోజురోజుకీ పెచ్చరిల్లుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాని సాగు వ్యవస్థీకృతమైంది. ఆంధ్రలో మాఫియా ముఠాలు 25 వేల ఎకరాల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువచేసే గంజాయిని పండిస్తున్నట్లు కథనాలు వెలుగుచూస్తున్నాయి.

  • కశ్మీర్‌లో హింసకు కళ్ళెం వేసేదెలా?

రెండేళ్ల క్రితం కేంద్రం జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక హోదాను తొలగించింది. కేంద్రం నిర్ణయంతో కశ్మీర్‌ వాసుల్లో అసంతృప్తి నెలకొన్నా, వారు గుంభనంగా ఉండటాన్ని ప్రభుత్వం గుర్తించలేకపోయింది. ఆ పరిస్థితుల్లో పాకిస్థాన్‌ నుంచి డ్రోన్ల ద్వారా భారీ ఎత్తున పిస్తోళ్ల వంటి చిన్న ఆయుధాల సరఫరా యత్నాలు పెరగడం ప్రమాదకర సంకేతం.

  • అంతర్జాతీయ సౌరకూటమిలోకి అమెరికా

అంతర్జాతీయ సౌర కూటమి (International Solar Alliance) లో అమెరికా చేరడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. సౌర శక్తిని వినియోగించుకునే భాగస్వామ్య అన్వేషణలో అమెరికా చేరడం కూటమిని మరింత బలోపేతం చేసిందని అన్నారు.

  • 'వారితో ప్రధాని చర్చలా?'

2014 పెషావర్‌ మారణహోమం కేసులో కోర్టుకు హాజరైన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. దాదాపు 150మంది చిన్నారుల నరమేధానికి పాల్పడిన వారితో ఎందుకు సంప్రదింపులు జరుపుతున్నారంటూ ప్రధానమంత్రిని నిలదీసింది.

  • గూగుల్‌కు యూరోపియన్‌ యూనియన్‌ కోర్టు ​షాక్​

గూగుల్‌కు యూరోపియన్‌ యూనియన్‌ కోర్టు షాక్​ ఇచ్చింది. 2.42 బిలియన్‌ యూరోల జరిమానా విధిస్తూ ఈయూ నియంత్రణ సంస్థ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ గూగుల్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

  • ఫైనల్​ చేరిన కివీస్​

టీ20 ప్రపంచకప్​లో తొలి సెమీస్​ మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై గెలిచింది న్యూజిలాండ్. 2019 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

Last Updated : Nov 11, 2021, 10:06 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.