ETV Bharat / city

జీవితంలో మరచిపోలేని సాయం అందించారు - Ramoji groups service

కనీవినీ ఎరుగని కుంభవృష్టితో రోడ్డున పడిన కేరళ ప్రజల జీవితాల్లో వెలుగుపూలు పూశాయి. ప్రకృతి ప్రకోపానికి మోడువారిన బతుకుల్లో ఆనంద కుసుమాలు వెల్లివిరిశాయి. ఆపత్కాలంలో రామోజీ గ్రూపు సంస్థలు అందించిన ఆపన్నహస్తం వారి మోములో సరికొత్త ఆనందాన్ని చిగురింపజేసింది. 'ఈనాడు' సహాయ నిధి ద్వారా రూ.7.77 కోట్లతో నిర్మించిన 121 ఇళ్ల పట్టాలు, తాళాలను లబ్ధిదారులకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అందజేశారు. ఈ సందర్భంగా రామోజీ గ్రూపు సంస్థల సేవల్ని అక్కడి ప్రజలు కొనియాడారు. తమ జీవితాల్లో మరచిపోలేని సహాయం అందించారంటూ... లబ్ధిదారులు రామోజీ గ్రూపు సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.

eenadu-group-houses-distributed-for-kerala-floods-victims
జీవితంలో మరచిపోలేని సాయం అందించారు
author img

By

Published : Feb 10, 2020, 7:01 AM IST

Updated : Feb 10, 2020, 11:27 AM IST

వరదల్లో నిలువనీడ లేకుండా పోయిన మాకు రామోజీ ఫిల్మ్‌సిటీ ఇళ్లు సమకూర్చింది. చాలా సంతోషంగా ఉంది. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు'' -సంతోషకుమారి, లబ్ధిదారు

''ప్రకృతి విపత్తుకు గురైన మాకు తిరిగి ఇళ్లు లభించడం చాలా సంతోషకరం. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న వారందరికీ కృతజ్ఞతలు'' -శాంతమ్మ, లబ్ధిదారు

''మాది కుట్టనాడ్‌లోని నెడుమూడి గ్రామపంచాయతీ. వరదల కారణంగా మా ఇళ్లన్నీ చాలావరకూ పూర్తిస్థాయిలో ధ్వంసమయ్యాయి. నీడ కోసం అర్థించిన మాకు కుటుంబశ్రీ ద్వారా రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎనలేని సాయం అందించింది'' -కవితా మోహన్‌, లబ్ధిదారు

జీవితంలో మరచిపోలేని సాయం అందించారు

ఇవీ చూడండి: మేడారం జాతరలో కృత్రిమ మేధ సఫలీకృతం

Last Updated : Feb 10, 2020, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.