ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మాచర్లలో ఈ నెల 12న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ దినేశ్ కుమార్, ఎస్పీ విశాల్ గున్ని, గురజాల ఆర్డీవో పార్థసారథి పర్యవేక్షించారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మిని కలిసి సత్కరించేందుకు సీఎం రానున్నారు. ఈ సందర్భంగా అధికారులు సీతా మహాలక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వెంకయ్య జీవిత విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తెగా నన్ను గుర్తిస్తూ.. మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. కోట్లాది మంది వందనాలు స్వీకరించే.. త్రివర్ణ పతకాన్ని రూపొందించిన మా నాన్న గాంధీగారికి ప్రియ శిష్యుడు. ఆయనను ప్రతిసారి తలచుకుంటాం. ప్రపంచ గుర్తించదగిన.. నిస్వార్థ, నిరాడంబర జీవి మా నాన్న.
సీతామహాలక్ష్మీ, పింగళి వెంకయ్య కుమార్తె
మా తాత.. త్రివర్ణపతాక రూపకర్తగానే కాకుండా.. అనేక కార్యక్రమాలు చేశారు. జీవితంలో కొన్ని నియమాలు పెట్టుకున్న ఆయన.. చివరి వరకు వాటికి కట్టుబడే ఉన్నారు. దేశానికి ఉపయోగపడే చదువులు మాత్రమే చదవాలనుకునేవారు. తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఆయన చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు. కేవలం ఒకే భాషకు పరిమితమైతే.. యువత ఏదీ సాధించాలేరని మా తాత గారు చెప్పారు. దక్షిణ భారతదేశానికి చెందిన ఆయన.. ఉత్తర భారతంలో కూడా వెలుగు వెలగడానికి కమ్యూనికేషన్ స్కీల్సే కారణం.. బహుభాషా కోవిదుడు మా తాత.
- పింగళి వెంకయ్య మనుమడు
ఇదీ చదవండి: పంటలకు డ్రోన్‌తో పురుగు మందుల పిచికారి