ETV Bharat / city

ప్రొటోకాల్‌ వివాదం.. విశాఖలో తెదేపా, వైకాపా వర్గీయుల బాహాబాహీ - అక్కాయపాలెంలో వైకాపా తెదేపా వర్గీయుల ఘర్షణ

Protocol Dispute: ఏపీలోని విశాఖలో తెదేపా-వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 26వ వార్డులో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో గొడవ మొదలైంది. రూ.కోటీ 53 లక్షల విలువైన జీవీఎంసీ అభివృద్ధి పనులకు సంబంధించి.. ఇవాళ అక్కయ్యపాలెంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ప్రొటోకాల్​ పాటించలేదంటూ తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణ జరిగింది.

ప్రొటోకాల్‌ వివాదం.. విశాఖలో తెదేపా, వైకాపా వర్గీయుల బాహాబాహీ

author img

By

Published : Jul 28, 2022, 2:44 PM IST

ప్రొటోకాల్‌ వివాదం.. విశాఖలో తెదేపా, వైకాపా వర్గీయుల బాహాబాహీ

Protocol Dispute: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నంలోని 26 వార్డులో తెదేపా, వైకాపా వర్గీయులు బాహాబాహీకి దిగారు. 26వ వార్డు సంఘం ఆఫీస్‌ కూడలిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ గొలగాని వెంకట హరికుమారి, వైకాపా ఉత్తర నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కేకే రాజు, వార్డు కార్పొరేటర్‌ బుక్కా శ్రావణి, డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీశ్​ పాల్గొన్నారు.

.

ప్రొటోకాల్‌ ప్రకారం శంకుస్థాపన ఎందుకు జరగలేదని తెదేపా నేతలు అక్కడి అధికారులను ప్రశ్నించారు. దీంతో మాటల యుద్ధం జరిగి వైకాపా, తెదేపా నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో తెదేపా జీవీఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ పేల శ్రీనుపై కొంతమంది వైకాపా నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీను కిందపడిపోగా.. ఆయన చేతికున్న విలువైన వాచ్‌ పూర్తిగా ధ్వంసమైంది. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

.

అనంతరం పేల శ్రీను, శ్రావణి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని.. ఇతర వార్డుల నుంచి వైకాపా నాయకులు, కార్యకర్తలను తీసుకొచ్చి వాగ్వాదానికి దిగారని ఆరోపించారు. కనీస మర్యాద ఇవ్వకుండా పోలీసులు కూడా వైకాపా నేతలకే పోలీసులు సహకరించారని.. తెదేపా నేతలను అడ్డుకునేందుకు రోప్‌ వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.