మాజీ హోంమంత్రి, జీవితాంతం కార్మికులకు అండగా నిలిచి సేవలందించిన నాయిని నర్సింహారెడ్డి మరణం విచారకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మరణం కార్మిక లోకానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. నాయిని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
నాయిని మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ప్రజల కోసం, కార్మికుల కోసం ఎన్నో ఉద్యమాలలో పాల్గొని యువ నాయకులకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. నిబద్ధత కలిగిన నాయకుడిని తెలుగువారు కోల్పోయారని పేర్కొన్నారు. నర్సింహారెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవీ చదవండి..