Reorganization of districts Andhra Pradesh : ఏపీలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. శుక్రవారం వైకాాపా ఎంపీలతో సమావేశమైన సీఎం జగన్ దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. జనగణనకు సంబంధించి కేంద్ర గణాంకశాఖ జారీ చేసిన ఆదేశాలకు ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియ ప్రారంభించాలంటూ ఉన్నతాధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చినట్టు సమాచారం. జనగణన పూర్తయ్యేలోగా విభజనకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేసి నోటిఫికేషన్‌కు సిద్ధం కావాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది.
India Census 2021 : వచ్చే ఏడాది జనవరి నుంచి జనగణన చేపట్టనున్న దృష్ట్యా ఈ ప్రక్రియను చేపట్టడంపై సీఎంఓ అధికారులు.. ముఖ్యమంత్రికి కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. అయితే కేంద్ర ఆదేశాలకు ఇబ్బంది లేకుండానే ఆర్థికేతర అంశాల్లో ప్రజాభిప్రాయ సేకరణ లాంటి కార్యాచరణను చేపట్టాలని ఆదేశాలిచ్చినట్టు వెల్లడవుతోంది. దీనిపై ఏర్పాటు అయిన సీఎస్ కమిటీ, జిల్లా స్థాయి కమిటీలు కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. అటు సీసీఎల్ఏ కూడా జిల్లాల ఏర్పాటు లో ఉన్న అంశాలతో కూడిన నివేదికను ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించింది. దాదాపుగా 2 వేల కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని కూడా రాష్ట్ర స్థాయి కమిటీ ప్రభుత్వానికి గతంలోనే నివేదించింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రాథమిక స్థాయిలో ఈ కసరత్తును పూర్తి చేశారు. ఏడాది క్రితమే జిల్లాల పునర్విభజన ప్రక్రియకు సర్కార్ శ్రీకారం చుట్టినప్పటికీ కరోనా కారణంగా జాప్యం జరిగింది.
ఇదీ చూడండి : TRSPP: నేడు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం... ఎంపీలకు సీఎం దిశానిర్దేశం