'కూటమి లేకున్నా.. ఒకేతాటిపై ఉన్నాం'
కేంద్రంలో మోదీ.. రాష్ట్రంలో కేసీఆర్.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా ఆరోపించారు. సీబీఐ, ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర సంస్థలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోవట్లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా స్పష్టం చేశారు. తెతెదేపా, సీపీఐ, సీపీఎం కొన్ని చోట్ల ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని.. పోటీలో లేని స్థానాల్లో హస్తంకు మద్దతు ఇవ్వమని కోరుతామని తెలిపారు. వారు విడిపోతే ఓట్లు చీలుతాయని అది తెరాసకు కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డారు. కూటమిగా ఏర్పడకపోయినా.. తామంతా ఒకతాటిపైనే ఉంటామని కుంతియా స్పష్టం చేశారు.