TVS Jupiter 125 SmartXonnect Launched : దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న తమ జుపిటర్ మోడల్ పోర్ట్‌ఫోలియోను టీవీఎస్ కంపెనీ మరింత విస్తరించింది. కొత్తగా స్మార్ట్‌కనెక్ట్ టెక్నాలజీతో జుపిటర్ 125 మోడల్(Jupiter 125 SmartXonnect)ను తాజాగా లాంచ్ చేసింది టీవీఎస్(TVS). ఈ జుపిటర్ మోడల్‌కు అత్యాధునిక కనెక్టివిటీ ఫీచర్లను యాడ్ చేయడంతో జుపిటర్ 125 స్కూటర్ మరింత స్మార్ట్ అయింది. ఇంతకీ ఈ నయా మోడల్ స్కూటర్ ఫీచర్లు ఏంటి? ధర ఎంతో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
TVS Jupiter 125 SmartXonnect Features : టీవీఎస్ కంపెనీ తాజాగా లాంచ్ చేసిన కొత్త జుపిటర్ 125 స్మార్ట్ఎక్స్ఓనెక్ట్ స్కూటర్‌ను.. అధునాతనమైన ఫీచర్లతో రూపొందించారు. దీనిలో బ్లూటూత్ ఆధారిత టీఎఫ్‌టీ డిజిటల్ క్లస్టర్ ఫీచర్ అందుబాటులో ఉంది. దీనితో టర్న్ బై టర్న్ నావిగేషన్ వసతిని పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్ఎక్స్ఓనెక్ట్.. మొబైల్ యాప్‌నకు కనెక్ట్ చేసుకుంటే.. మరిన్ని ఫంక్షన్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇది ఐఓఎస్‌తో పాటు ఆండ్రాయిడ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ యాప్‌లో హైబ్రిడ్ కన్సోల్, వాయిస్ అసిస్టెన్స్, కాల్, మెసేజ్ అలర్ట్స్ వంటివి ఉంటాయి.
అంతేకాకుండా.. క్రికెట్ స్కోర్, న్యూస్ అప్‌డేట్లను అందించేలా ట్రాఫిక్ టైమ్ స్క్రీన్, డీటీఈ (distance to empty), ఐఎఫ్‌ఈ (instantaneous fuel economy), ఏఎఫ్‌ఈ (average fuel economy), వెనుక కూర్చునే వారికి బ్యాక్ రెస్ట్‌తో కూడిన ప్రీమియం సీటు వంటి ఫీచర్లు కొత్త టీవీఎస్ జుపిటర్ 125 స్మార్ట్ఎక్స్ఓనెక్ట్లో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నయా స్కూటర్లో 'ఫాలో-మీ' హెడ్‌ల్యాంప్ ఫీచర్‌ను కూడా టీవీఎస్ సంస్థ యాడ్ చేసింది. దీని ద్వారా.. ఇంజిన్ ఆగిపోయిన 20 సెకండ్స్ హెడ్ ల్యాంప్ ఆన్‌లోనే ఉంటుందన్నమాట.
Jupiter 125 SmartXonnect Price : ఈ కొత్త టీవీఎస్ స్కూటర్లో మాత్రం ఇంజిన్ మార్చలేదని కంపెనీ తెలిపింది. 124.8సీసీ, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తున్న జుపిటర్ 125 స్మార్ట్ఎక్స్ఓనెక్ట్ స్కూటీ.. 8 హెచ్‌పీ శక్తిని, 10.5 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుందని టీవీఎస్ పేర్కొంది. ఇక ధర విషయానికొస్తే దిల్లీలో దీని ఎక్స్‌షోరూం ధర రూ.96,855గా ఉంది. ఇది ఎలిగంట్ రెడ్, మ్యాట్ కాపర్ బ్రాంజ్ అనే రెండు రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇక ఈ TVS Jupiter 125 SmartXonnect స్కూటర్.. టీవీఎస్ ఎన్‌టార్క్, హోండా యాక్టివా 125, సుజుకీ ఏసెస్ 125, హీరో మాస్ట్రో ఎడ్జ్ 125కి గట్టిపోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
రూ.50వేలలో కొత్త బైక్ కొనాలా?.. బడ్జెట్ ఫ్రెండ్లీ మోడళ్లు ఇవే.. ఫీచర్లు అదుర్స్!
అదిరిపోయే ఫీచర్లతో 5 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ!