ETV Bharat / business

'అప్పు చేసి ట్రేడింగ్​ చేయొద్దు.. ఒక్కసారి ఇవి గుర్తిస్తే మంచి లాభాలు!' - స్టాక్​ మార్కెట్లు అప్​డేట్స్​

Stock Market Trading: స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న యువత సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని గణాంకాలు విశ్లేషిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యూహంతో మదుపు చేస్తున్నప్పుడు ఎలాంటి నష్టభయాలూ ఉండవు. కానీ, స్వల్పకాలంలోనే రెట్టింపు లాభాలు రావాలనే ఆశతో.. ట్రేడింగ్‌ చేస్తున్న వారి సంఖ్య పెరగడం, దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటం ఆందోళన కలిగించే అంశమే. స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ఎప్పుడూ సత్ఫలితాలు ఇవ్వదు. క్రమశిక్షణతో దీర్ఘకాలం మదుపు చేసిన వారే లాభాలను చేజిక్కించుకుంటారు. ఇక ట్రేడింగ్‌ చేసే వారు పాటించాల్సిన కొన్ని సూత్రాలు ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Trading in stock markets? Follow these steps, Tips Before trade

author img

By

Published : Jul 17, 2022, 1:01 PM IST

Stock Market Trading: ఇటీవల కాలంలో మీరు ట్రేడింగ్‌ చేశారా? అయితే, ఒకసారి ఆ లావాదేవీలను నాలుగైదు సార్లు పరిశీలించండి. ఎందుకంటే.. ప్రపంచంలో మీకు ట్రేడింగ్‌ గురించి నేర్పే గొప్ప పుస్తకం మీరు చేసిన ట్రేడింగ్‌ ఖాతా వివరాలే. వంద ట్రేడింగ్‌ లావాదేవీలు పూర్తి చేసిన ట్రేడర్‌.. సాధ్యమైనన్ని పొరపాట్లు చేసే ఉంటారని నిపుణుల అంచనా. కాబట్టి, ఒకసారి మీ ట్రేడింగ్‌ సరళిని గమనిస్తే.. ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. స్టాక్‌ మార్కెట్‌ను మించిన 'ఇన్వెస్ట్‌మెంట్‌ గురు' లేరు. చాలామంది ట్రేడింగ్‌ చేసి, నష్టపోయాం అని భావిస్తుంటారు. కానీ, ఆ నష్టం నేర్పిన పాఠాలేమిటి? వాటిని లాభాలుగా మలచుకునేందుకు ఉన్న అవకాశాలేమిటి అనేది గుర్తించరు.

ఆటలాంటిదే..
స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేసే చాలామంది కొన్ని భావోద్వేగాలతో ఉంటారు. తాము ఎంచుకున్న షేరు ట్రేడ్‌ మంచి లాభాలను ఇస్తే.. తమ నిర్ణయాన్ని అభినందించుకుంటారు. పొరపాటున నష్టం వస్తే దురదృష్టం వల్ల ఇలా జరిగిందని అనుకుంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ట్రేడింగ్‌ ఒక ఆట. ఇక్కడ గెలుపు ఓటములు సహజం. మీరు చేయబోతున్న వేల కొద్దీ ట్రేడింగ్‌ లావాదేవీల్లో ఇదీ ఒకటి. మీ వ్యూహం సరైనది అయితే.. దీర్ఘకాలంలో లాభాలు సంపాదించేందుకు వీలవుతుంది.

ఏం చేస్తున్నారో తెలుసుకోండి:
మార్కెట్‌ గురువుగా పాఠాలు నేర్పిస్తుంది. కాస్త కటువుగానూ ఉంటుంది. చిన్న పొరపాటు చేసినా.. మీ మొత్తం పెట్టుబడిని ఒక్కసారిగా హరించి వేస్తుంది. మార్కెట్లో ఎప్పుడూ మీరు ఎంత మేరకు సురక్షితంగా ఉంటారో అంత వరకే పెట్టుబడులు పెట్టాలి. నిర్ణయాలు వేగంగా తీసుకోలేని వ్యక్తికి ట్రేడింగ్‌ ఏ మాత్రం సరిపోదు. ముఖ్యంగా మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతున్నప్పుడు ఇలాంటి ధోరణితో నష్టాలే మూటగట్టుకుంటారు. ఇలాంటి వారు సాధ్యమైనంత వరకూ ట్రేడింగ్‌కు దూరంగా ఉండటమే మేలు. ఏం చేయాలి.. ఎప్పుడు చేయాలి.. ఈ రెండే ట్రేడింగ్‌లో సగం విజయానికి కారణం అవుతాయి.

నష్టం ఎంత మేరకు?
పెట్టుబడిని రక్షించుకుంటూ.. లాభాలను సంపాదించాలి. ట్రేడింగ్‌లో పాటించాల్సిన ప్రధాన వ్యూహం ఇదే. చిన్న మొత్తంతో ట్రేడింగ్‌ చేస్తూ.. పెట్టుబడిలో 1 శాతానికి మించి నష్టపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంపాటు ట్రేడింగ్‌ చేస్తూ లాభాలను ఒడిసిపట్టుకోగలరు. నష్టాలను మించి లాభాలు వస్తున్నంత కాలం, మీ వ్యూహాలు సరైన ఫలితాలు ఇస్తున్నట్లే. చిన్న మొత్తాలతో లావాదేవీలు చేయడం వల్ల ఒకేసారి నష్టాల నుంచి తప్పించుకోవచ్చు.

అర్థం చేసుకోకుండా..:
ట్రేడింగ్‌లో విజయం సాధించిన వారి గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ, వారి వ్యూహాలను గుడ్డిగా అనుసరించాలని అనుకుంటేనే పొరపాటు. చాలామంది సామాజిక వేదికల్లో తమ విజయాల గురించి పేర్కొంటూ కనిపిస్తారు. ఆ వ్యూహాలు వారు ఎంతో కష్టపడి నేర్చుకొని ఉంటారు. వాటిని అర్థం చేసుకోకుండా అనుకరించరాదు.

ఆ మాటలు వినొద్దు:
ఒక ట్రేడర్‌.. తన డబ్బుతోపాటు, విలువైన కాలాన్నీ ఖర్చు చేసి ట్రేడింగ్‌ లావాదేవీలు నిర్వహిస్తుంటారు. స్నేహితులు చెప్పారనో.. సామాజిక వేదికల్లో వచ్చిన సందేశాల ఆధారంగా ఒక షేరును ఎంచుకోవడం ఎప్పుడూ సరికాదు. మార్కెట్‌ బాగున్నప్పుడే ఇలాంటివి ఒకటి రెండు 'టిప్స్‌' లాభాలను అందించవచ్చు. అనిశ్చితి కొనసాగుతున్నప్పుడు ఇలాంటివి ప్రతికూలంగా మారతాయి.

వ్యాపారమే:
ఒక వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పెట్టుబడి, ఆదాయం ఎలా వస్తుంది, ఖర్చులేముంటాయి, నష్టాలు వచ్చే ఆస్కారం.. తదితర అంశాలను పరిశీలించాలి. షేర్లలో ట్రేడింగ్‌ లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడూ ఇదే సూత్రం వర్తిస్తుంది. మార్కెట్లో రూపాయి మదుపు చేసే ముందు దాన్ని కాపాడుకునేందుకు మీ దగ్గర అవసరమైన శక్తియుక్తులున్నాయా చూసుకోవాలి. ట్రేడింగ్‌ ఖాతా ప్రారంభించామా.. డబ్బు పెట్టామా.. ఏదో ఒక షేరు కాల్‌ ఆప్షన్‌ కొని, అమ్మామా.. ట్రేడింగ్‌ అంటే ఇంతే అనుకుంటారు చాలామంది. ట్రేడింగ్‌ అనేది ఎంతో కష్టమైన పని. సమాచారాన్ని విశ్లేషిస్తూ.. అంతర్గత భావోద్వేగాలను అదుపు చేసుకుంటూ సాగే ఒక ప్రక్రియ అని గుర్తించాలి.

అపజయాలే ఎక్కువ:
మార్కెట్‌ను నిశితంగా గమనిస్తూ ఉండే వారికి.. డబ్బు సంపాదించేందుకు మార్కెట్‌ కొన్ని పరిమిత అవకాశాలనే ఇస్తుందనే సూత్రం తెలుసు. అందుకే, వారు ఆ అవకాశాల కోసం ఓపిగ్గా ఎదురు చూస్తూ ఉంటారు. 10లో మూడు లేదా నాలుగుసార్లు మాత్రమే వారు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. చాలా సందర్భాల్లో వారు నష్టభయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉండే ట్రేడింగ్‌ చేస్తారు. అంత ధైర్యం మనకు ఉన్నప్పుడే ట్రేడింగ్‌ గురించి ఆలోచించాలి.

వికాస్​ సింఘానియా

''ట్రేడింగ్‌ అనేది ఒక యంత్రం లాంటిది. అన్ని విడి భాగాలూ సరిగ్గా ఉంటేనే దాని పనితీరు బాగుంటుంది. మార్కెట్లో ట్రేడింగ్‌ చేసే వారూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ట్రేడింగ్‌ను నేర్చుకునేందుకు ప్రయత్నించే దశలో చిన్న మొత్తాలతోనే ప్రారంభించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పులు చేసి, ఈ లావాదేవీలు చేయొద్దు. లాభాలు వస్తే పొంగిపోవద్దు. నష్టాలు వస్తే ఆందోళన చెందకూడదు. ముందే చెప్పినట్లు.. భావోద్వేగాల నియంత్రణ, నష్టాన్ని భరించగలిగే శక్తి, మీ దగ్గర మిగులు మొత్తం ఉన్నప్పుడే ట్రేడింగ్‌ జోలికి వెళ్లండి.''

- వికాస్‌ సింఘానియా, సీఈఓ, ట్రేడ్‌స్మార్ట్‌

ఇవీ చూడండి: ఎస్​బీఐ రుణాలు మరింత భారం.. వడ్డీ రేట్లు పెంపు

ద్రవ్యోల్బణంలోనూ డాలరుదే హవా.. బలపడుతున్న అమెరికా కరెన్సీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.