ETV Bharat / business

బెట్టింగ్​ వీరులకు GST షాక్​.. ఆన్​లైన్ గేమింగ్​పై 28% ట్యాక్స్.. ఓడిపోయినా కట్టాల్సిందే! - గుర్రపు పందేలు ఆన్​లైన్ గేమింగ్​పై జీఎస్​టీ

GST On Online Gaming : ఆన్‌లైన్‌ గేమర్స్​కు షాక్ తగిలింది. ఆన్​లైన్​ గేమింగ్​పై 28 శాతం జీఎస్​టీ విధించారు. ఈ మొత్తాన్ని​గేమింగ్ ముఖ విలువపై వసూలు చేయనున్నారు. ఈ మేరకు జీఎస్​టీ మండలి నిర్ణయం తీసుకుంది.

gst on online gaming
gst on online gaming
author img

By

Published : Jul 11, 2023, 7:06 PM IST

Updated : Jul 11, 2023, 9:19 PM IST

GST On Online Gaming : బెట్టింగ్​ వీరులకు షాక్​ ఇచ్చింది జీఎస్​టీ మండలి. ఆన్​లైన్​ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేల​పై 28 శాతం జీఎస్​టీ విధించాలని నిర్ణయించింది. ఈ మొత్తాన్ని​ బెట్టింగ్ ముఖ విలువ (బెట్టింగ్ అమౌంట్​)పై వసూలు చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం జీఎస్​టీ మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర​ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వీటితో పాటు అరుదైన వ్యాధుల చికిత్సలో వినియోగించే ఆహారం (ఫూడ్​ ఫర్ స్పెషల్​ మెడికల్​ పర్పసెస్-FSMP), క్యాన్సర్​ ఔషధం డైనటుక్సిమాబ్​ (Dinutuximab)కు జీఎస్​టీ నుంచి మినహాయింపు ఇచ్చామని వెల్లడించారు. ప్రైవేటు కంపెనీల ఉపగ్రహ ప్రయోగ సేవలనూ జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు చెప్పారు. సినిమా హాళ్లలో విక్రయించే ఆహారం, పానీయాలపై పన్ను 18శాతం కాకుండా 5శాతం విధించనున్నామని తెలిపారు.

  • 50th GST Council Meeting | GST Council exempts cancer-related drugs, medicines for rare diseases and food products for special medical purposes from GST tax: Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/T1DoacbmC3

    — ANI (@ANI) July 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Group Of Ministers GST : ఆన్​లైన్​ గేమింగ్ విషయంలో గేమ్​ ఆఫ్​ స్కిల్​, గేమ్ ఆఫ్​ ఛాన్స్​ అనే తేడాను తొలగించాలని జీఎస్​టీ కౌన్సిల్ నిర్ణయించినట్లు మహారాష్ట్ర అటవీ, సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్​ ముంగంటివార్​ తెలిపారు. అప్పిలేట్​ ట్రైబ్యునళ్ల ఏర్పాటుకు కూడా మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్​లైన్ గేమింగ్​పై తొలుత ముఖ విలువ మీద పన్ను వేయాలా? గేమింగ్ ఆదాయంపై పన్ను వేయాలా? ప్లాట్‌ఫామ్‌ ఫీజు మీద మాత్రమే పన్నువేయాలా? అనేది ఇటీవల సమావేశమైన ఆర్థిక మంత్రులు కమిటీ.. చర్చించింది. అనంతరం వీటిపై 28 శాతం జీఎస్​టీ విధించాలని జీఎస్​టీ మండలికి సిఫార్సు చేస్తూ నివేదిక సమర్పించింది.

  • On the occasion of the 50th meeting of the GST Council, Union Finance Minister Smt. @nsitharaman releases a Special Cover and customised myStamp.

    The Special Cover and customised myStamp was presented to the Union FM Smt. @nsitharaman by the Chief Post Master General, Delhi… pic.twitter.com/feTDX5AM6h

    — Ministry of Finance (@FinMinIndia) July 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

GST Council Meeting : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ అధ్యక్షతన 50వ జీఎస్​టీ మండలి సమావేశం దిల్లీలో మంగళవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఆన్​లైన్ గేమింగ్​పై నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో భాగంగా 'జీఎస్​టీ మండలి- ఒక ప్రయాణం కోసం 50 అడుగులు' అనే లఘ చిత్రాన్ని విడుదల చేశారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇప్పటివరకు జరిగిన జీఎస్​టీ సమావేశాల్లో 1,500 నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ కార్యాలయం ట్వీట్ చేసింది.

  • Union Finance Minister Smt. @nsitharaman chairs the 50th meeting of the GST Council, in Vigyan Bhawan, New Delhi, today.

    Along with the Union Finance Minister, Union Minister of State for Finance Shri @mppchaudhary, besides Finance Ministers of States & UTs (with legislature)… pic.twitter.com/O3ChawSH5v

ఈ సమావేశంలో దిల్లీ సర్కిల్​ చీఫ్​ పోస్ట్ మాస్టర్ జనరల్ బహూకరించిన​ ప్రత్యేక కవర్​, 'మైస్టాంప్​' అనే కస్టమైస్డ్​ స్టాంప్​ను సీతారామన్ విడుదల చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యాలయం ట్వీట్ చేసింది.

  • श्रीमती @nsitharaman ने आज नई दिल्ली में जीएसटी परिषद की 50वीं बैठक के अवसर पर 'जीएसटी परिषद - एक यात्रा की ओर 50 कदम' नामक एक लघु फिल्म जारी की।

    परिषद ने अब तक 49 बैठकें की हैं और Co-operative Federalism की भावना में लगभग 1500 निर्णय लिए हैं।

    50वीं बैठक एक मील का पत्थर है जो… pic.twitter.com/nteQFvZsLD

    — Nirmala Sitharaman Office (@nsitharamanoffc) July 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jul 11, 2023, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.