RBI Rules for Minimum Balance in Accounts : మనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఎలాంటి సంక్షేమ పథకాలు పొందాలన్నా, ఏవిధమైన ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక బ్యాంకులో చాలా వరకు సేవింగ్స్ అకౌంట్ తీసే ఉంటారు. అయితే మనం తీసిన బ్యాంక్ అకౌంట్(Bank Account) ఎప్పుడూ రన్ అవుతూ ఉండాలంటే.. ఖాతా ఉన్నన్ని రోజులు అందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. ఇది కొన్ని బ్యాంకుల్లో రూ. 500 నుంచి 1000 వరకు ఉంటే.. మరికొన్నింటిలో రూ. 5వేల నుంచి 10వేల రూపాయల వరకూ ఉంటుంది.
Bank Account Minimum Balance Rules : ఇదిలా ఉంటే నేటి ఆధునిక కాలంలో జనాలు బ్యాంకింగ్ రంగంలో వచ్చే మార్పులు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో జీరో బ్యాలెన్స్‌తో కేంద్రం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కొన్ని బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ ఖాతాతో పాటు మరికొన్ని అకౌంట్స్ కూడా ఉంటాయి. ఇక అసలు విషయమేమిటంటే.. అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఫెనాల్టీలు విధిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే.. జీరో బ్యాలెన్స్ ఉంటే అకౌంట్ నెగిటీవ్ బ్యాలెన్స్‌లోకి వెళ్తుందా? ఇదే విషయంపై ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
అకౌంట్లో కనీసం ఉండాల్సిన డబ్బులు లేనప్పుడు విధించే ఛార్జీలతో పొదుపు ఖాతాలు నెగిటీవ్‌లోకి వెళ్లకుండా ఆర్బీఐ కొన్ని నియమ నిబంధనల్ని తీసుకొచ్చింది. దాదాపు బ్యాంకులన్నీ ఖాతాదారులకు మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ విధిస్తాయి. వాటి ప్రకారం.. తగిన డబ్బు లేకపోతే ఛార్జీలు వేసే అధికారం వారికి ఉంటుంది. ఇవి బ్యాంకు, బ్రాంచ్‌ను బట్టి మారుతుంటాయి. అయితే నార్మల్‌గా గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని శాఖలకు ఈ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. షార్ట్‌ఫాల్ శాతం లేదా హై నెట్ వర్త్ ఉన్నవారికి ఈ జరిమానాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు.
ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే మంచిది?
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2014లో ఈ జరిమానాలపై క్లారిటీ ఇచ్చేందుకు ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. అందులో బ్యాంకులకు ఛార్జీలు విధించే అధికారం ఉన్నప్పటికీ.. ఖాతాదారులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని పేర్కొంది.
- బ్యాంకులు తమ ఖాతాదారులకు వారి ఖాతాలో కనీసం ఉండాల్సిన డబ్బు లేనప్పుడు.. ముందుగా ఎస్ఎంఎస్, ఈమెయిల్ లేదా ఫిజికల్ లెటర్స్ ద్వారా వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.
- ఆ తర్వాత నోటీసు పంపిన రోజు నుంచి వన్ మంత్ లోపు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే అప్పుడు పెనాల్టీ ఛార్జీలు వర్తిస్తాయని కస్టమర్స్‌కు తెలియజేయాలి.
- అయినా కనీస బ్యాలెన్స్ లేకపోతే.. అప్పుడు బ్యాంకులు ఖాతాదారులకు తెలియకుండానే జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. అయితే బ్యాంకులు జరిమానా ఛార్జీలపై విధించేందుకు తమ బోర్డు నుంచి అనుమతి పొందాలి. అదేవిధంగా అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉండాలి.
- అలాగే బ్యాంకులు విధించే పెనాల్టీ ఛార్జీలు కస్టమర్స్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ తక్కువగా ఉందో.. దానికి అనుగుణంగానే ఉండాలి. అంతేగానీ ఎక్కువ ఛార్జీలు విధించకూడదు.
- బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అంగీకరించిన అసలు బ్యాలెన్స్, మినిమమ్ బ్యాలెన్స్ మధ్య వ్యత్యాసం ఆధారం చేసుకొని బ్యాంకులు ఈ ఛార్జీలను నిర్ణీత శాతంగా లెక్కించాలి.
- ఇకపోతే ఈ పెనాల్టీల రికవరీ కోసం బ్యాంకులు తగిన స్లాబ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని ఆర్బీఐ రూల్స్ చెబుతున్నాయి.
- మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు విధించే ఈ జరిమానాలు సహేతుకంగా ఉండాలి. అలాగే బ్యాంకింగ్ సేవలను అందించడానికి అవి సగటు ఖర్చును మించకూడదని రూల్స్ సూచిస్తున్నాయి.
- ఇక చివరగా.. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు విధించే పెనాల్టీలు కస్టమర్ ఖాతాను చిక్కుల్లో పడేయకుండా ఉండాలని ఆర్బీఐ నిబంధనలు పేర్కొంటున్నాయి.
మహిళలకు గుడ్‌న్యూస్- ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.కోటి ఇన్సూరెన్స్ కవరేజ్!