ఆగస్టులో సేవా రంగ కార్యకలాపాలు కాస్త మెరుగయ్యాయి. అయితే కరోనా వల్ల నెలకొన్న పరిస్థితులతో క్లయింట్ డిమాండ్ ప్రభావితమవ్వడం కారణంగా.. వ్యాపార కార్యకలాపాల్లో ఇంకా ఒడుదొడుకులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఐహెచ్ఎస్ మార్కిట్ విడుదల చేసిన నెలవారీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) నివేదిక ద్వారా ఈ విషయం వెల్లడైంది.
ఈ నివేదిక ప్రకారం.. సేవా రంగ వ్యాపార కార్యకలాపాల పీఎంఐ ఆగస్టులో 41.8కి పెరిగింది. ఇది జులైలో 34.2గా, జూన్లో 33.7గా ఉండటం గమనార్హం.
అయినప్పటికీ వరుసగా ఆరో నెల కూడా భారత సేవా రంగ కార్యకలాపాలు ఇంకా తక్కువగానే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. సాధారణంగా ఈ సూచీ 50కి పైగా ఉంటే.. వ్యాపార కార్యకలాపాలు మెరుగ్గా ఉన్నట్లు భావించాలని తెలిపింది.
ఇదీ చూడండి:ఎస్బీఐలో స్వచ్ఛంద విరమణ పథకం