ETV Bharat / business

ఫిబ్రవరిలోనూ రెపో రేటు యథాతథమే! - రెపో రేటుపై ఎస్​బీఐ నివేదిక

డిసెంబర్​లో రిటైల్​ ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల గరిష్ఠం వద్ద 7.35 శాతానికి చేరిన నేపథ్యంలో.. వచ్చే నెలలోనూ రెపో రేటు యథాతథంగా ఉండనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎస్​బీఐ విడుదల చేసిన ఇటీవలి నివేదికలో ఇదే విషయాన్ని ఉటంకించింది.

RBI
ఆర్బీఐ
author img

By

Published : Jan 14, 2020, 8:30 PM IST

ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో వరుసగా రెండో సమీక్షలోనూ కీలక వడ్డీరేట్లలో భారతీయ రిజర్వు బ్యాంక్​ ఎలాంటి మార్పు చేయకపోవచ్చని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉల్లి, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడం కారణంగా డిసెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల గరిష్ఠానికి చేరి 7.35 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 8 శాతాన్ని దాటొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలు ఆర్బీఐ వడ్డీరేట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

ద్రవ్యోల్బణం గణాంకాలే కీలకం..

సాధారణంగా ద్రవ్యోల్బణ గణాంకాలను ఆధారంగా తీసుకుని వడ్డీరేట్లలో మార్పులు చేస్తుంటారు. అయితే ఈసారి రిటైల్‌ ద్రవ్యోల్బణ స్థాయి గణనీయంగా ఉండటం కారణంగా ఫిబ్రవరిలో జరిగే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచే అవకాశాలున్నాయని ఎస్‌బీఐ అధ్యయన నివేదిక పేర్కొంది. గత డిసెంబరులో జరిగిన సమీక్షలోనూ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన విషయం విదితమే. 2020 సంవత్సరం మొత్తంలోనూ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు కన్పించట్లేదని ఈ నివేదిక పేర్కొంది.

5 సార్లు 135 బేసిస్​ పాయింట్లు...

ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 ఫిబ్రవరి నుంచి అక్టోబరు మధ్య వరుసగా రేట్ల తగ్గింపు చేపట్టారు. ఈ కాలంలో మొత్తం 5 సార్లు 135 బేసిస్‌ పాయింట్ల మేర కీలక వడ్డీరేట్లను తగ్గించారు. అయితే మందగిస్తోన్న ఆర్థిక వ్యవస్థ.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో 2019 డిసెంబరులో జరిగిన సమీక్షలో కీలక వడ్డీరేటును 5.15 శాతం వద్ద యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. వచ్చే నెలలో తదుపరి సమీక్ష జరగనుంది. ఫిబ్రవరి 6న ఆర్బీఐ సమీక్ష నిర్ణయాలను ప్రకటిస్తారు. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత జరగబోయే సమీక్ష కావడం వల్ల దీనిపై ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి:పండుగ వేళ దిగొచ్చిన పసిడి, వెండి ధరలు

New Delhi, Jan 14 (ANI): Bureau of Indian Standards Scientist-F, HS Pasricha, on Tuesday said that after January 15, 2021, no gold jewellery and artefacts will be sold without BIS hallmark. Adding to it, he said gold will only be sold in three carats i.e. 14, 18 and 22. "Under BIS Act, the offender will be fined Rs 1 lakh which can vary accordingly and imprisonment," he added.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.