బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.61 తగ్గి.. రూ.40,422కు చేరింది.
దేశీయంగా డిమాండు లేమితో పసిడి ధరలు తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడమూ మరో కారణంగా తెలుస్తోంది.
కిలో వెండి ధర నేడు రూ.602 (దిల్లీలో) తగ్గి.. రూ.47,083కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,544 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 17.75 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి: ఒడుదొడుకులు ఎదురైనా చివరకు రికార్డులు బద్దలు